చిత్రం చెప్పే విశేషాలు..!

(08-01-2023/1)

తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దులోని కమలాపూర్‌ ఏనుగుల సంరక్షణ కేంద్రం పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచుతోంది. 

source : eenadu

గుంటూరు సంగం జాగర్లమూడి చెరువులో నీటిపై సోలార్‌ పలకలు అమర్చడం ద్వారా పునరుత్పాదక రంగంలో సౌరవిద్యుదుత్పత్తికి శ్రీకారం చుట్టారు. 

source : eenadu

పాపికొండల్లో పర్యాటకులు సందడి చేశారు. పర్యాటకులను బోటు పాయింట్‌ వద్ద పోలీసులు తనిఖీ చేశారు. 

source : eenadu

గుంటూరు నగరవాసులకు ఆహ్లాదాన్ని పంచే గాంధీ పార్కు అభివృద్ధి పనులు ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉన్నాయి. గతంలో వివిధ నిర్మాణాల కోసం వేసిన పిల్లర్లకు తీగలు అల్లుకుని అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. 

source : eenadu

అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యంలో కొర్రా గ్రామానికి సమీపంలోని పెదపాడు కొండల మధ్య కొర్రా జలపాతం చూపరులను ఆకట్టుకుంటోంది. 

source : eenadu

రాజపేట, యాదగిరిగుట్ట మండలాల్లో వ్యవసాయ కూలీలుగా కోల్‌కతా, పశ్చిమ బెంగాల్‌ నుంచి పురుషులు బృందాలుగా వచ్చి ఉపాధి పొందుతున్నారు.

source : eenadu

ఉమ్మడి పాలమూరు జిల్లాలో యాసంగిలో సాగుకు రైతులు సమాయత్తం అవుతున్నారు. నీరు సమృద్ధిగా ఉన్నచోట వరి సాగుకు మొగ్గు చూపుతున్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం సింగోటం జలాశయం సమీపంలో వరినాట్లకు సిద్ధమయ్యారు.

source : eenadu

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home