చిత్రం చెప్పే విశేషాలు..!

(19-01-2023/1)

ఛత్తీస్‌గఢ్‌ జగదల్‌పుర్‌ సమీపంలోని కాంగెర్‌ లోయ జాతీయ పార్కులో కనిపించిన అత్యంత అరుదైన నారింజ రంగు గబ్బిలం.

Source: Eenadu

విద్యానగర్‌లో దారానికి చిక్కుకున్న పావురాన్ని కాపాడుతున్న యువకులు. ఆకర్షించిన దృశ్యం.

Source: Eenadu

సంక్రాంతి పండగ తర్వాత విశాఖ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు వచ్చిన ప్రయాణికులతో రైల్వే స్టేషన్‌ కిటకిటలాడుతోంది.

Source: Eenadu

జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో అతిశీతల వాతావరణం కారణంగా బుధవారం గడ్డకట్టుకుపోయిన జలపాతాన్ని మొబైల్‌ఫోన్‌లో బంధిస్తున్న పర్యాటకురాలు.

Source: Eenadu

ఐదేళ్ల కిందట హైదరాబాద్‌ అత్తాపూర్‌ రోడ్డులోని జ్యోతినగర్‌లో గాయపడి కనిపించిన రామచిలుకను రియాజ్‌ అలీ చేరదీసి వైద్యం చేయించారు. అప్పటి నుంచి అది తనను వదిలి వెళ్లడం లేదని తెలిపారు.

Source: Eenadu

విజయవాడ కనకదుర్గ వారధిపై చిమ్మచీకట్లు అలముకున్నాయి. సీఎం సహా వీఐపీలు, నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ వంతెనపై విద్యుద్దీపాలు వెలగకపోవడం భద్రతాపరంగా డొల్లతనం కనిపిస్తోంది.

Source: Eenadu

దేశ ద్రోహులు, టెర్రరిస్టులను మట్టుబెట్టటానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆక్టోపస్‌ బృందాలకు జిల్లాలోని ప్రాజెక్ట్‌ల వద్ద జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో రెండు రోజుల శిక్షణను ప్రారంభించారు.

Source: Eenadu

సంక్రాంతి పండగకు దూర ప్రాంతాల నుంచి స్వగ్రామాలకు వచ్చిన వారు విజయనగరం, సీతంపేట మన్యంలోని పలు పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తున్నారు. బుధవారం ఎన్టీఆర్‌ సాహస ఉద్యానవన కేంద్రానికి తరలివచ్చారు. సాహస, ఇతర క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

Source: Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home