చిత్రం చెప్పే విశేషాలు..!

(20-01-2023/1)

మంచు మనోజ్‌ కొత్త చిత్రాన్ని ప్రకటించారు. కొంతకాలం నుంచి సినిమాలకు దూరంగా ఉన్న ఆయన శుక్రవారం కొత్త ప్రాజెక్ట్‌ విశేషాలను వెల్లడించారు. ‘వాట్‌ ది ఫిష్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

source:EENADU

గణతంత్ర వేడుకలకు వన్నె తెచ్చేలా దుకాణదారులు సిద్ధమయ్యారు. కొండాపూర్‌లో అమ్మకానికి సిద్ధం చేసిన మువ్వన్నెల రంగుల వస్తువుల్ని ఇలా కొలువుదీర్చారు.

source:EENADU

క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి గురువారం మణికొండలో సందడి చేశారు. పైపులైన్‌ రోడ్డులో ఉన్న ఓ మాల్‌లో ఓ సంస్థ వ్యాపార ప్రకటనను ఇక్కడ చిత్రీకరించారు. యువ పారిశ్రామిక వేత్త మనీషా పాల్గొన్నారు.

source:EENADU

కర్నూలు జిల్లా ఆలూరు మండలం హత్తిబెళగల్‌లో ఓ వృక్షం ఆలయానికి శిఖరంలా మారింది. సుమారు 50 సంవత్సరాల నుంచి గుడిపై చెట్టు పెరుగుతూ వస్తోందని స్థానికులు తెలిపారు.

source:EENADU

కృష్ణా జిల్లాలోని రామవరప్పాడులో వెంకమ్మ, పేరంటాలమ్మ, పోలేరమ్మ అమ్మవార్ల సంక్రాంతి సంబరాల జాతర మహోత్సవాలు గురువారం ముగిశాయి. ఈ నేపథ్యంలో హంస వాహనంపై తెప్పోత్సవం నిర్వహించారు

source:EENADU

‘మిస్‌ క్వీన్‌ ఆఫ్‌ ఇండియా’ కీరిటాన్ని కర్ణాటకకు చెందిన సమృద్ధి వి.శెట్టి దక్కించుకున్నారు. ఇటీవల కేరళ రాష్ట్రం కొచ్చిలో ఓ ఆర్థిక వ్యవహారాల సంస్థ నిర్వహించిన పోటీలకు హాజరైన ఆమె.. ఈ అందాల కిరీటాన్ని దక్కించుకున్నారు

source:EENADU

అనకాపల్లి ఎలమంచిలి పట్టణంలో గురువారం నిర్వహించిన కనకమహాలక్ష్మి అమ్మవారి జాతరకు జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తారు. 

source:EENADU

వరంగల్‌-హైదరాబాద్‌ జాతీయ రహదారి ఘట్‌కేసర్‌ కూడలి వద్ద రహదారుల మధ్య దూరం తెలిపేందుకు సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. కొన్ని బోర్డులకు చెట్టుకొమ్మలు అడ్డురాగా.. మరికొన్ని విరిగిపోయాయి.

source:EENADU

హైదరాబాద్‌లో ఏళ్లుగా నీళ్లులేక ఎండిపోయిన ఇబ్రహీంపట్నం చెరువు వర్షాలతో నిండుకుండలా మారింది. గతంలో ఇక్కడ ఏర్పాటుచేసిన స్తంభాలు, నియంత్రికలు నీట మునిగాయి. 

source:EENADU

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ-నీతా అంబానీల రెండో కుమారుడు అనంత్, మర్చంట్‌ కుటుంబ వారసురాలైన రాధికా మర్చంట్‌ల నిశ్చితార్థం గురువారం ముంబయిలోని అంబానీల నివాసమైన యాంటీలియాలో కుటుంబ సంప్రదాయాల ప్రకారం జరిగింది.

source:EENADU

సికింద్రాబాద్‌ మినిస్టర్‌ రోడ్డులోని దక్కన్‌ స్పోర్ట్స్‌ నిట్‌వేర్‌లో జరిగిన అగ్నిప్రమాదం దృశ్యమిది. 

source:EENADU

తెలంగాణ అమరుల స్మారకంగా హైదరాబాద్‌లోని సచివాలయం, లుంబినీ పార్కు వద్ద ప్రభుత్వం చేపట్టిన అమరవీరుల జ్యోతి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. వచ్చే నెల 17న నూతన సచివాలయంతో పాటు దీన్ని ప్రారంభించే అవకాశం ఉంది. 

source:EENADU

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home