చిత్రం చెప్పే విశేషాలు

(21-01-2023/1)

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో గంగోత్రి ఆలయాన్ని కప్పేసిన మంచు.

Source:Eenadu

సహజసిద్ధ, ఆహ్లాదకరమైన వాతావరణంతో విలసిల్లే మారేడుమిల్లి ప్రాంతానికి నిత్యం పర్యటకులు వందల సంఖ్యలో తరలివస్తున్నారు. తెల్లవారు జామున సూర్యోదయ సమయంలో అద్భుత దృశ్యాలు ఆవిష్కృతమవుతున్నాయి.

Source:Eenadu

అపూర్వం.. అద్భుతం అనిపించే సింగారాలతో ఉద్యాననగరి బెంగళూరు లాల్‌బాగ్‌లో శుక్రవారం ఫలపుష్ప ప్రదర్శన ప్రారంభమైంది. ఆకట్టుకునే నిర్మాణాలు, కట్టడాలు, మందిరాలు, ప్రముఖుల విగ్రహాలు, చారిత్రక ఘట్ట నమూనా రూపాలను పూలతో అలంకరించారు

Source:Eenadu

ఆస్ట్రేలియాలోని ఎయిర్‌లీ బీచ్‌ సమీపంలో గుర్తించిన ప్రపంచంలోనే అతి పెద్దదిగా భావిస్తున్న కప్ప(టోడ్‌). దీని బరువు 2.7 కిలోలు ఉంటుందని క్వీన్స్‌లాండ్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ సైన్స్‌ రేంజర్‌ కైలీ గ్రే పేర్కొన్నారు. 

Source:Eenadu

ఆడ పులి ఫర్హా నల్లమల అడవుల్లోని అమ్రాబాద్‌ అడవికి రాణిగా అవతరించింది. అటవీ అధికారులు ఎఫ్‌-6గా వ్యవహరించే ఫర్హా రెండు విడతల్లో ఆరింటికి జన్మనిచ్చింది. అందులో ఒకటైన ఎఫ్‌-18 పులి నాలుగింటికి జన్మనిచ్చింది. 

Source:Eenadu

బేగంపేటలోని హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ (హెచ్‌పీఎస్‌) శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం దర్పణ్‌ అకాడమీ ఆఫ్‌ ఫెర్మార్మింగ్‌ ఆర్ట్స్‌కు చెందిన డా.మల్లిక సారాబాయి బృందం చేసిన ‘డాన్స్‌ ఆఫ్‌ లైఫ్‌ నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

Source:Eenadu

రంగారెడ్డి జిల్లా నూతన సమీకృత కలెక్టరేట్‌కు వెళ్లే మార్గం పచ్చందాలు సంతరించుకుంది. రహదారికి ఇరువైపులా ఏపుగా పెరిగిన మొక్కలు ఆహ్లాదం పంచుతున్నాయి.

Source:Eenadu

ఖమ్మంలోని లకారం ట్యాంకుబండ్‌ వద్ద పర్యాటకులకు ఆహ్లాదం పంచేందుకు రూ.20 లక్షలతో రోప్‌ సైక్లింగ్‌ను గతంలో ఏర్పాటు చేశారు. నిర్వహణ లోపంతో దాన్నెవరూ వినియోగించటం లేదు. 

Source:Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు(20-07-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(20-07-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(19-07-2025)

Eenadu.net Home