చిత్రం చెప్పే విశేషాలు..!

(25-01-2023/1)

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రైల్వే యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ను మువ్వన్నెల రంగుల విద్యుత్తు దీపాలతో అలంకరించారు.

source:EENADU

మూసీ సుందరీకరణలో భాగంగా పలు చోట్ల పాదచారుల మార్గాలు నిర్మించారు. ఆహ్లాదంగా తీర్చిదిద్దేందుకు రూ.కోట్లు వెచ్చించారు. వరదలకు మొత్తం కొట్టుకుపోగా చాదర్‌ఘాట్‌లో వాటి ఆనవాలు మాత్రమే మిగిలాయి.

source:EENADU

మెట్టుగూడలోని ఆలుగడ్డబావి బస్టాప్‌లో రోజూ ఇసుక లారీలు, ట్రక్కులు నిలుపుతున్నారు. బస్సుల పేర్లు కనిపించడం లేదంటూ ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

source:EENADU

కూకట్‌పల్లిలో విద్యుత్‌ తీగలు మార్చే క్రమంలో స్తంభాలపై కుప్పలుగా కేబుల్‌ తీగలు అడ్డుగా ఉన్నాయి. వాటి మధ్యలో నుంచి సిబ్బంది తిప్పలు పడుతూ పనులు చేయాల్సి వస్తోంది.

source:EENADU

చుట్టూ పచ్చని పొలాలు. అందులో ఒక ఎండిన చెట్టు. కొమ్మ కొమ్మకు శ్వేత రంగులో పూలు పూసినట్టుగా కొంగలు నిలిచాయి. ఆ దృశ్యం రాజన్న సిరిసిల్ల జిల్లా మామిడిపల్లిలో కనిపించింది.

source:EENADU

హిందూ మహా సముద్రంలో రక్షణ, భద్రత వ్యవస్థలను బలోపేతం చేసేందుకు ట్రోపెక్స్‌ విన్యాసాలు ఉపకరిస్తాయని నౌకాదళ వర్గాలు తెలిపాయి. జనవరి నుంచి మార్చి వరకూ ఈ విన్యాసాలు కొనసాగుతాయని వెల్లడించాయి.

source:EENADU

ఇండో-నేపాల్‌ ఆర్ట్‌ సింపోజియం మంగళవారం మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్‌ ఆర్ట్‌గ్యాలరీలో రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్‌ ప్రారంభించారు. భారత్‌, నేపాల్‌ చిత్రకారుల చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి.

source:EENADU

జనసేన అధినేత, నటుడు పవన్‌ కళ్యాణ్‌ మంగళవారం కొండగట్టుకు వెళ్తూ శామీర్‌పేట మండలం తుర్కపల్లి వద్ద కాసేపు ఆగారు. అక్కడ ముస్లిం సోదరులు స్వాగతం పలికారు.

source:EENADU

మల్లకంభంపై ఆసనాలు చేస్తున్న వీరంతా రైల్వే పోలీస్‌ సిబ్బంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా 26న జరగబోయే ప్రదర్శనకు మంగళవారం సికింద్రాబాద్‌ ఆర్‌ఆర్‌సీ మైదానంలో సాధన చేశారు.

source:EENADU

తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలోని వేలివెన్ను, మోర్త, వెలగదుర్రు, కాల్దరి, చివటం, పసలపూడి తదితర గ్రామాల్లోని అపురూప సామగ్రి ఇప్పటి ప్రజలకు కనువిందు చేస్తున్నాయి.

source:EENADU

అల్లూరి జిల్లా మన్యంలో మళ్లీ చలిపులి పంజా విసిరింది. మంగళవారం ఉష్ణోగ్రతలు పడిపోయాయి. చింతపల్లిలో అత్యల్పంగా 4.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

source:EENADU

స్పెషల్‌ పాటల బాట పట్టిన తమన్నా..!

శ్రీలంక.. సిద్ధమా..!

అక్షయ్‌కుమార్‌ నాగిని డ్యాన్స్‌

Eenadu.net Home