చిత్రం చెప్పే విశేషాలు..!
(18-02-2023/1)
ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం భక్తజనంతో కిక్కిరిసిపోయింది. మహాశివరాత్రి పర్వదినం కావడంతో శివమాలధారులు, సాధారణ భక్తులు కుటుంబ సమేతంగా శ్రీగిరికి చేరుకున్నారు.
source:eenadu
ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లఖ్‌నవూలోని రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కూరగాయలు, పూల ప్రదర్శనలో పొడవాటి సొరకాయతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్
source:eenadu
సినీనటి అనన్య నాగళ్ల శుక్రవారం మాదాపూర్‌లో సందడి చేశారు. స్థానికంగా ఉన్న బీ న్యూ మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్టోర్‌లో సామ్‌సంగ్ ఎస్ 23 సిరీస్ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేశారు.
source:eenadu
కేపీహెచ్‌బీలో నటి మాళవిక శర్మ సందడి చేసింది. నెక్సెస్ మాల్‌లో శుక్రవారం బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఆధ్వర్యంలో మోబైల్ ఫోన్‌ను ఆమె మార్కెట్‌లోకి విడుదల చేశారు.
source:eenadu
ఎన్ని పైవంతెనలు నిర్మించినా.. అండర్‌పాస్‌లు అందుబాటులోకి వచ్చినా.. నగరవాసులకు ట్రాఫిక్ నరకం తప్పడం లేదు. మాదాపూర్‌లో శుక్రవారం రాత్రి ఎక్కడికక్కడ వాహనాలు స్తంభించిన దృశ్యమిది.
source:eenadu
నెక్లెస్‌రోడ్డులో శుక్రవారం జరిగిన ముఖ్యమంత్రి జన్మదిన వేడుకకు కేసీఆర్ కటౌట్‌ను బైక్‌పై తీసుకొస్తున్న అభిమానులు
source:eenadu
విశాఖపట్నం మురళీ నగర్ ఎన్జీవోస్ కాలనీలో కృష్ణస్వామి నాయుడు తన ఇంటి ముందు కొన్ని నెలల క్రితం ఆనప పాదు పెంచారు. ఇది పెరిగేందుకు తాళ్లు కట్టి ఆధారం ఏర్పాటు చేయడంతో...ఏకంగా రెండు అంతస్తుల మేడపైకి పాకింది.
source:eenadu
నిత్యం పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థినీ. విద్యార్థులు తమ తోటివారితో కలిసి వేదికపై ఆడిపాడారు. మల్కాజిగిరి భాష్యం ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థుల వీడ్కోలు వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
source:eenadu