చిత్రం చెప్పే విశేషాలు..!
(26-01-2023/1)
జూబ్లీహిల్స్ రోడ్‌నం.10లో నిన్నటి వరకు పచ్చని ఆకులతో కళకళలాడిన ఓ చెట్టు.. ఒక్కసారిగా కాండం నుంచి కొమ్మల వరకు చెదలు పట్టి పూర్తిగా ఎండిపోయింది.
source:EENADU
బంజారాహిల్స్‌లోని నీరూస్‌లో వివాహాది శుభకార్యాలకు నూతన వస్త్రశ్రేణిని బుధవారం ఆవిష్కరించారు. సినీ తారలు, రూప దర్శినులు సందడి చేశారు.
source:EENADU
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా మద్నూర్‌కు చెందిన మధుకర్ సుద్దముక్కలనే అక్షరాలుగా చేసి జాతీయ గీతాన్ని మూడు భాష (హిందీ, తెలుగు, ఆంగ్లం)ల్లో బ్లాక్‌బోర్డులపై అతికించారు.
source:EENADU
ఐఐటీ-జేఈఈ మెయిన్స్ పరీక్షలకు తమ పిల్లలను తల్లిదండ్రులే పరీక్ష కేంద్రాలకు తీసుకొస్తున్నారు. హయత్‌నగర్‌లోని భాగ్యలతలో ఓ పరీక్ష కేంద్రం వద్ద బుధవారం కనిపించిన చిత్రమిది.
source:EENADU
గణతంత్ర వేడుకల సందర్భంగా అనంతపురంలో విద్యుత్తు కాంతుల్లో వెలిగిపోతున్న గడియార స్తంభం.
source:EENADU
కన్నడ నటుడు, దివంగత పునీత్‌రాజ్‌కుమార్ విగ్రహాన్ని ఇనుప వ్యర్థాలతో తయారు చేశారు. గుంటూరులో తెనాలి శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, ఆయన కుమారులు రవిచంద్ర, శ్రీహర్ష ఈ విగ్రహాన్ని సిద్ధం చేశారు.
source:EENADU
విజయనగరం, సాలూరు మండలం పండయ్యవలసలోని పామాయిల్ తోటలో అక్కడక్కడా పుట్టలు వెలిశాయి. అందులో ఒకటి దాదాపు పది అడుగుల ఎత్తులో ఉండి చూపరులను ఆకట్టుకుంటోంది. .
source:EENADU
అనకాపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం సారె ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ఏటా గవరపాలెం గౌరీ పరమేశ్వరుల జాతరకు ముందు సారె ఊరేగించడం ఆనవాయితీ.
source:EENADU
హనుమకొండ వడ్డేపల్లి చర్చి నుంచి ఫిల్టర్ బెడ్ రోడ్డుకు వెళ్లే దారిలో బుధవారం ప్రధాన పైపులైను లీకేజీ అయ్యింది. తాగునీరు నింగికి ఎగసిపడింది.
source:EENADU
హైదరాబాద్ నగరం గణతంత్ర వేడుకలకు ముస్తాబైంది. బుధవారం రాత్రి చార్మినార్, కాచిగూడ రైల్వేస్టేషన్ విద్యుత్తు కాంతుల్లో వెలుగులీనాయి.
source:EENADU
విద్యుత్తు వెలుగుల జిగేలు.. చుట్టూ అల్లుకున్న పచ్చదనం... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న నూతన సచివాలయ భవనం నమూనా ఇది.
source:EENADU
గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ శాసనసభ భవనాన్ని మూడు రంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు.
source:EENADU