చిత్రం చెప్పే విశేషాలు..!

(27-01-2023/1)

మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలానికి చెందిన వడ్డేబోయిన సదాశివుడు తన తనయుడి కోసం చేసిన ఆలోచన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కారు నడుపుతున్న అనుభూతిని కలిగించేందుకు సైకిల్‌కి స్టీరింగ్‌ అమర్చారు.

Source:Eenadu

వసంత పంచమిని పురస్కరించుకుని నిర్మల్‌ జిల్లా కేంద్రంలో గురువారం ఓ బుల్లి రైలు సందడి చేసింది. దీనిని ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్థులు తయారు చేశారు. 

Source:Eenadu

కోహెడ మండలం తంగళ్లపల్లి, కూరెల్ల గ్రామాల మధ్య ఉన్న మోయతుమ్మెద వాగు అందాలు చూపరులను ఆకట్టుకుంటోంది. ఎత్తైన పచ్చని గుట్టల మధ్య నుంచి ప్రవహించే ఈ వాగు దగ్గర సింగరాయ జాతర నిర్వహిస్తారు.

Source:Eenadu 

మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌ ఏరియాలోని గనుల్లో కోతుల సంచారం రోజు రోజుకీ పెరిగిపోతోంది. దీంతో స్థానికులు, కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. 

Source:Eenadu

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆవరణలో ఎర్రటి కాగితం పూల మొక్కలు అటుగా వెళ్లేవారిని ఆకట్టుకుంటున్నాయి. ఫల పరిశోధనా కేంద్రంలోకి వచ్చేవారిని ఆహ్వానిస్తున్నట్లుగా ఎర్రని పుష్పాలున్నాయి. 

Source:Eenadu

మన్యంలో చలి తీవ్రత కొనసాగుతోంది. మూడు రోజులుగా చింతపల్లిలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం అత్యల్పంగా 4.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం అధికారులు తెలిపారు. 

Source:Eenadu

గణతంత్ర దినోత్సవాల్లో భాగంగా విశాఖపట్నంలోని ఎండాడ అంబేడ్కర్‌ యువజన సంఘం ఆధ్వర్యంలో 1600 అడుగుల జాతీయ జెండాను ప్రదర్శించారు. 

Source:Eenadu

గణతంత్ర వేడుకల్లో భాగంగా రాజమహేంద్రవరంలో జరిగిన కార్యక్రమంలో పుంగనూరు దూడలు అందరినీ ఆకట్టుకున్నాయి. 16 అంగుళాల దూడ ఒకటి, రెండేళ్ల వయసున్న 24 అంగుళాల దూడ మరొకటి ముచ్చట గొలిపాయి. 

Source:Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు(21-07-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(21-07-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(20-07-2025)

Eenadu.net Home