చిత్రం చెప్పే విశేషాలు..!

(28-01-2023/1)

రథసప్తమి వేడుకలు తిరుమలలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో స్వామివారికి సప్త వాహన సేవలు నిర్వహించారు. సూర్యప్రభ వాహనంపై భక్తులకు స్వామి దర్శనమిచ్చారు.

source:EENADU

కోనసీమ జిల్లా గోదావరి నదీ పరివాహక ప్రాంతం.. సూర్యాస్తమయ సమయంలో అలసిన భానుడి సంధ్యాకిరణాలు గలగలా పారుతున్న గోదావరి జలంపై పడి సువర్ణంలా మెరిశాయి.

source:EENADU

ఉడుపి జిల్లా కార్కళ సమీపంలోని బైలూరు ఉమికల్‌ బెట్టపై ఏర్పాటు చేసిన 33 అడుగుల ఎత్తైన పరశురాముని విగ్రహం ఉన్న థీమ్‌ పార్కును శుక్రవారం ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ప్రారంభించారు


source:EENADU

బొబ్బిలి మండలంలోని దిబ్బగుడివలసలో రైతు రొంగలి సత్యనారాయణకు చెందిన ఓ మునగ చెట్టు కాయలు ఇరగకాసింది. ఆకుల కంటే కాయలే ఎక్కువగా ఉన్నాయి.

source:EENADU

రథసప్తమి వేడుకలను పురస్కరించుకుని కర్నూలు నగరంలోని సూర్యనారాయణస్వామి ఆలయం ముస్తాబైంది. శనివారం ఉదయం 5.30 గంటలకు ప్రత్యక్ష సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

source:EENADU

హైదరాబాద్‌లోని మాదాపూర్‌ హైటెక్స్‌లో పెటెక్స్‌ ఇండియా-2023 ప్రదర్శన శుక్రవారం అబ్బురపర్చింది. అరుదైన విదేశీ, దేశీయ జాతుల శునకాలు, పిల్లులు, పక్షులు, చేపలు ఆకట్టుకున్నాయి.

source:EENADU

హైదరాబాద్, బల్కంపేట లింగయ్యనగర్‌ బస్తీలో ఉన్న ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహం పరిస్థితి. అమ్మాయిలకు నీళ్లు కావాలంటే సంపులోకి దిగాల్సిందే.

source:EENADU

భారత్‌కు చెందిన సుధా రవి, ఆమె కుమార్తె రక్షిత సింగపూర్‌లో 26 వేల ఐస్‌క్రీం పుల్లలతో రంగోలి కళాకృతి వేసి సింగపూర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు.

source:EENADU

చిత్రం చెప్పేవిశేషాలు(21-07-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(21-07-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(20-07-2025)

Eenadu.net Home