చిత్రం చెప్పే విశేషాలు..!

(29-01-2023/1)

ముఖ్యమంత్రి జగన్‌ భద్రత పేరుతో ఆర్టీసీ బస్టాండు రోడ్డులో డివైడర్‌ మధ్యలో ఏపుగా పెరిగిన పచ్చని చెట్లను అడ్డంగా నరికేశారు. ఈనెల 30న సీఎం పల్నాడు జిల్లా వినుకొండ వస్తున్నారు. 

source:eenadu

సైఫాబాద్‌ ప్రధాన రహదారిలో ఓ ఆర్టీసీ బస్సు పాడైపోవడంతో డ్రైవర్‌ రోడ్డుపక్కన నిలిపాడు. ఇంతలో అటుగా వచ్చిన ఓ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ చలానా వేసేందుకు ఫొటో తీసుకున్నాడు.

source:eenadu

మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇవ్వొద్దని పోలీసులు ఎంత మొత్తుకున్నా తల్లిదండ్రులకు పట్టడం లేదు. బీకేగూడలో శనివారం ఓ బాలుడు ద్విచక్ర వాహనాన్ని రహదారిపై నడుపుతూ ఇలా కనిపించాడు.

source:eenadu

చారిత్రక విజయనగర సామ్రాజ్య రాజధాని హంపీ వీధుల్లో యువతీయువకుల  కుస్తీపోటీలు ప్రారంభమయ్యాయి. 

source:eenadu

శ్రీకాకుళం జిల్లాలో రథసప్తమి సందర్భంగా శనివారం తీరానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సముద్రస్నానాలు చేసి సూర్యునికి పూజలు చేశారు. 

source:eenadu

అనంతపురం జిల్లాలోని డి.హీరేహాళ్‌లో పవనసుతుడి ఊరేగింపు

source:eenadu

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన ఓ సాంస్కృతిక, సంగీత సంస్థ వ్యవస్థాపకుడు తడకమళ్ల రామరంగారావు యోగా సాధన చేస్తూ నీటిపై పద్మాసనం, సుఖాసనంతో వేశారు.

source:eenadu

హైదరాబాద్‌ నగరంలో చలి మళ్లీ పెరిగింది. గాంధీ ఆసుపత్రిలో రోగుల సంబంధీకులు పడుకోవడానికి ఏర్పాటు చేసిన షెడ్లు పూర్తిగా నిండిపోవడంతో పలువురు ఇలా కాలిబాటపై నిద్రించారు.

source:eenadu

సికింద్రాబాద్‌-దిల్‌సుఖ్‌నగర్‌ మార్గంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణికులు అత్యంత ప్రమాదకరంగా వేలాడుతూ ప్రయాణిస్తున్నారు.

source:eenadu

చిత్రం చెప్పేవిశేషాలు(21-07-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(21-07-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(20-07-2025)

Eenadu.net Home