చిత్రం చెప్పే విశేషాలు..!
(02-02-2023/1)
వికారాబాద్- వెంకటాపూర్ తండాలో వెలసిన జగదాంబ భవానీ మాత, జగద్గురు సేవాలాల్ మహరాజ్ ఆలయ 16వ వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయ.
source: Eenadu
సిద్దిపేట జిల్లాలోని చిన్నకోడూరు మండలంలో రైతులు ఎక్కువగా పొద్దుతిరుగుడు పంటపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఎటూ చూసినా కళకళలాడుతున్న పొద్దుతిరుగుడు పైర్లు కనిపిస్తున్నాయి.
source: Eenadu
కంచె వేసేందుకు ఉపయోగించే రాతి కడ్డీ మీద ఓ శిల్పకారుడు తన కళను ప్రదర్శించాడు. ఊసరవెల్లి బొమ్మను అందంగా మలిచి రంగు వేశాడు. హైదరాబాద్ కొత్తగూడలోని పాలపిట్ట సైక్లింగ్ పార్కులో ఈ కళాకృతి సహజత్వం ఉట్టిపడుతూ అందరినీ ఆకట్టుకుంటోంది.
source: Eenadu
హనుమకొండ జిల్లాలోని నక్కలగుట్ట హరిత కాకతీయ హోటల్ పక్కన నగర పాలక సంస్థ ఆధునిక హంగులతో బస్ షెల్టర్ ఏర్పాటు చేసింది. దీని ఎదుట కొంతమంది ప్రత్యేక వాహనం పెట్టి.. టిఫిన్ సెంటర్ నడిపిస్తున్నారు.
source: Eenadu
సరకు రవాణా చేసే వాహన చోదకులు నిబంధనలు పాటించకపోవడంతో ప్రమాదాలకు కారణమవుతున్నారు. జాతీయ రహదారిపై ఓ మినీ వ్యానుపై భారీ ఎత్తున మూటలు కట్టి ప్రమాదకరంగా రవాణా చేస్తుండగా ‘న్యూస్‌టుడే’ క్లిక్ మనిపించింది.
source: Eenadu
పొదలకూరు, నెల్లూరు జిల్లా, లింగంపల్లికి చెందిన సుమారు 200 మంది పైగా రైతులకి ఈ చెరువు కింద భూములున్నాయి. గత నాలుగేళ్లుగా చెరువు అభివృద్ధి పనులు చేయకపోవడంతో లోతట్టు ప్రాంతం గుర్రపుడెక్కతో నిండిపోయింది.
source: Eenadu
భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని అనకాపల్ల్కి జిల్లా, నర్సీపట్నం షిర్డీ సాయి ఆలయం ప్రాంతం బుధవారం రాత్రి దీపకాంతులతో శోభిల్లింది. గుడి పక్కనే ఉన్న స్టేడియం కనులు మిరిమిట్లుగొల్పే లక్ష దీపాల కాంతితో ధగధగలాడింది.
source: Eenadu
అల్లూరి సీతారామ రాజు జిల్లా, రాజవొమ్మంగి మండలం సింగంపల్లికి చెందిన రైతులు కొల్లి శ్రీనుబాబు, కోనా అప్పన్నబాబు ఇంటి వద్ద ఫ్యాషన్ ఫ్రూట్స్ (పాసిఫ్లోరా ఎడులిస్ జాతి) సాగు చేపట్టారు.
source: Eenadu