చిత్రం చెప్పే విశేషాలు..!

(03-02-2023/1)

కె. విశ్వనాథ్‌ భౌతికకాయం వద్ద నివాళులు అర్పిస్తున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

source:eenadu

కళాతపస్వి దర్శకుడు కె. విశ్వనాథ్‌కు సంతాపం ప్రకటిస్తున్న మెగాస్టార్‌ చిరంజీవి.

source:eenadu

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, ప్రత్యేక ఆశీర్వచనం ఇచ్చారు.

source:eenadu

నిజామాబాద్‌ జిల్లా పెద్దగుట్ట(బడాపహాడ్‌) దర్గాలో తమ కోరికలను మనసులో అనుకుని గుర్రం ప్రతిమ వద్ద గొలుసుకు తాళం వేసి పేపరుపై కోరిక రాసి తాడుతో కడతారు.

source:eenadu

పార్వతీపురం పట్టణ బైపాస్‌ రోడ్డు మలుపు వద్ద దుర్గగుడి ఎదురుగా గురువారం త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ట్రాక్టరుపై దుంగలను తరలిస్తుండగా తాళ్లు తెగి.. రోడ్డుపై పడ్డాయి. వెనుక వస్తున్న వాహన చోదకులు, పాదచారులు అప్రమత్తమవడంతో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. 

source:eenadu

కర్నూలు నగరపాలక సంస్థ అధికారులు నగరంలో అభివృద్ధి పనుల పేరుతో ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారు. కల్లూరు పట్టణం 27వ వార్డు కృష్ణానగర్‌ పరిధిలో వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లే దారిలో సీసీ రోడ్డు బాగున్నా.. దానిపై మళ్లీ నిర్మిస్తున్నారు.

source:eenadu

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం ముచ్చింతల్‌ శ్రీరామనగరంలో సమతా కుంభ్‌ ఉత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. యాగశాలలో వేడుకలకు చినజీయర్‌స్వామి అంకురార్పణ చేశారు. 

source:eenadu

ఫ్రాన్స్‌ నౌకాదళం గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌లో స్వాధీనం చేసుకున్న అసాల్ట్‌ రైఫిళ్లు, క్షిపణులు ఇవి. 

source:eenadu

చిత్రం చెప్పేవిశేషాలు(21-07-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(21-07-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(20-07-2025)

Eenadu.net Home