చిత్రం చెప్పే విశేషాలు..!

(04-02-2023/1)

పురాతన నలందా విశ్వవిద్యాలయం సమీపంలో 1200 ఏళ్ల నాటి రెండు రాతి విగ్రహాలను కనుగొన్నారు. బిహార్‌లోని సర్లిచక్‌ గ్రామ సమీపంలోని తార్సిన్హ్‌ కొలనులో పూడిక తీస్తుండగా ఈ విగ్రహాలు బయటపడ్డాయి. 

Source.Eenadu

పాకిస్థాన్‌- భారత్‌ సరిహద్దుల్లోని అమృత్‌సర్‌ సెక్టార్‌లో తాజాగా ఓ డ్రోన్‌ కనిపించింది. శుక్రవారం దానిని కూల్చిన భద్రతా అధికారులు మూడు కిలోలు బరువున్న ఓ సంచిని స్వాధీనం చేసుకున్నారు.

Source.Eenadu

చక్కగా ఉన్న రోడ్డును తవ్వేసి కొత్త రోడ్డు వేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని మూసాపేట పరిధి శ్రీహరినగర్‌ చౌరస్తా నుంచి మూడు నెలల కిందట భూగర్భ కాలువను నిర్మించారు. అందుకోసం రోడ్డును ఓ వైపు తవ్వారు. 

Source.Eenadu

 భావితరాలకు వ్యవసాయం గురించి తెలిసేలా రామంతాపూర్‌లోని హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో విద్యార్థులకు సాగుపై ప్రత్యక్షంగా మెలకువలు నేర్పిస్తున్నారు. Source.Eenadu

నిజామాబాద్‌ జిల్లాలోని బడాపహాడ్‌ దర్గా దర్శనానికి వచ్చే భక్తులకు తాగునీటి ఇబ్బందులు తీవ్రంగా ఎదురవుతున్నాయి. నీటి కోసం కోతులు కూడా భక్తుల వెంట పడుతున్నాయి. 

Source.Eenadu

బాపట్ల జిల్లాలోని చీరాల మండలం ఈపూరుపాలెం రైల్వే స్టేషన్‌కు వెళ్లే దారిలో ఓ పాడుబడిన బావి ఉంది. దీని పక్క నుంచే విద్యార్థులు రాకపోకలు సాగిస్తుండటంతో ప్రమాదకరంగా ఉంది.

Source.Eenadu

ప్రస్తుతం చిల్లర గలగల అంతటా తగ్గింది. నిజామాబాద్‌ జిల్లా బడాపహాడ్‌లో ఏటా జరిగే ఉర్సు ఉత్సవాలకు భక్తుల సౌకర్యార్థం స్థానికంగా కొందరు చిరువ్యాపారులు భారీగా చిల్లర అందుబాటులో ఉంచి విక్రయిస్తుంటారు. 

Source.Eenadu

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం శ్రీరామనగరంలో నిర్వహిస్తున్న సమతా కుంభ్‌-2023 ఉత్సవాలు శుక్రవారం రెండో రోజుకు చేరాయి. చిన జీయర్‌ స్వామి గరుడ పట ఆరాధన, ధ్వజారోహణం చేశారు. 

Source.Eenadu

చిత్రం చెప్పే విశేషాలు(29-03-2024/1)

చిత్రం చెప్పే విశేషాలు(28-03-2024/2)

చిత్రం చెప్పే విశేషాలు (28-03-2024/1)

Eenadu.net Home