చిత్రం చెప్పే విశేషాలు..!

(05-02-2023/1)

పలు కేసుల్లో పట్టుకున్న వాహనాలను చాదర్‌ఘాట్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఏళ్ల తరబడి నిలిపారు. ఇవి నిత్యం ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్నాయి.

source:Eenadu

గోల్కొండ కోట నుంచి చూస్తే సెవెన్‌ టూమ్స్‌ గోపురాలు.. పక్కనే అధునాతన భవనాలు ఆకట్టుకుంటున్నాయి. పాత కొత్త నిర్మాణాలు నగరవాసులను కనువిందు చేస్తున్నాయి.

source:Eenadu

చౌమొహల్లా ప్యాలెస్‌లో శనివారం జరిగిన ‘స్త్రీ సత్రంగి’లో ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. యువతులు సందడి చేశారు.

source:Eenadu

సికింద్రాబాద్‌ ఉస్మానియా యూనివర్సిటీ ప్రధాన రహదారిపై పిచ్చి మొక్కలు, ఎండిపోయిన ఆకులను నిత్యం తగలబెడుతున్నారు. పక్కనే విద్యుత్‌ నియంత్రికలు ఉన్నా వాటిని పట్టించుకోవట్లేదు.

source:Eenadu

శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఏడు రోడ్ల కూడలి వద్ద ఉన్న ఎన్టీఆర్‌ నగరపాలక సంస్థ క్రీడామైదానంలో యోగా వేదాంత సేవా సమితి ఆధ్వర్యంలో తల్లిదండ్రుల పూజా మహోత్సవం నిర్వహించారు. 

source:Eenadu

గవర్నర్‌ ముఖ్య కార్యదర్శిగా శనివారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌.

source:Eenadu

సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళుతున్న రైలుపై ఖమ్మం రైల్వేస్టేషన్‌ దాటిన తర్వాత ముస్తఫానగర్‌ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసరడంతో సీ12 బోగీలో అద్దానికి పగుళ్లు వచ్చాయి.

source:Eenadu

క్యాన్సర్‌పై చైతన్యం చేస్తూ శనివారం విశాఖపట్నం బీచ్‌ రోడ్డులో ‘అవగాహన నడక’ కార్యక్రమం నిర్వహించారు. యువత డ్యాన్స్‌ చేసి అక్కడికి వచ్చిన వారిని ఆకట్టుకున్నారు.

source:Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు(21-07-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(21-07-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(20-07-2025)

Eenadu.net Home