చిత్రం చెప్పే విశేషాలు..!
(07-02-2023/1)
అల్లూరి సీతారామ రాజు జిల్లాలోని రాజవొమ్మంగిలో సోమవారం దాహం తీర్చుకోవడానికి ఓ గోవు దుకాణం వద్దకు వెళ్లింది. అక్కడ ఉన్న బకెట్‌లో ఉన్న నీళ్లు తాగి తలపైకి ఎత్తడంతో బకెట్ ఇరుక్కొని పోయింది.
source:Eenadu
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని చింతగూడ గ్రామానికి చెందిన రవికుమార్ ఖతర్ దేశంలో ఉద్యోగం చేస్తున్నారు. అక్కడ మయన్మార్ దేశానికి చెందిన జిన్‌నెహు థియేన్‌ను ప్రేమించాడు. సోమవారం పెళ్లితో ఒక్కటయ్యారు.
source:Eenadu
సూర్యాపేట జిల్లా కేంద్రం సమీపంలో దురాజ్‌పల్లి పెద్దగట్టు (గొల్లగట్టు) జాతరలో రెండో రోజు గట్టుతో పాటు పరిసర ప్రాంతాలు మొత్తం భక్తజనంతో నిండిపోయాయి.
source:Eenadu
నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం వైకాపా ఇన్‌ఛార్జిగా నియమితులైన ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి సోమవారం నగరానికి వచ్చారు. ఆయన అభిమానులు, కార్యకర్తలు ర్యాలీ కోసం జాతీయ రహదారి నుంచి ట్రాఫిక్‌ని మళ్లించారు. ట్రాఫిక్‌లో అంబులెన్స్ చిక్కుకుంది.
source:Eenadu
ఉత్తర కర్ణాటకలో పేరెన్నికగన్న జోయిడా తాలూకా ఉలవిలోని చెన్నబసవేశ్వర మహా రథోత్సవం సోమవారం వైభవంగా నిర్వహించారు.
source:Eenadu
విశాఖనగరంలోని డైమండ్ పార్కు వద్ద సోమవారం ఒకరు ఈ-వాహనంపై వెళ్తుండగా పలువురు ఆసక్తిగా చూశారు. వృద్ధులు, దివ్యాంగులకు సౌకర్యవంతంగా ఉండేలా రూపొందించిన ఎలక్ట్రిక్ మొబైల్ స్కూటర్ గంటకు 20 కి.మీ వేగంతో వెళుతుంది.
source:Eenadu
భారత నౌకాదళానికి చెందిన విమాన వాహక యుద్ధ నౌక ‘ఐఎన్‌ఎస్ విక్రాంత్’పై సోమవారం తొలి లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎల్‌ఏసీ) దిగినట్లు నేవీ వర్గాలు తెలిపాయి.
source:Eenadu
విశాఖపట్నం: తగరపువలస సమీపంలో సోమవారం ద్విచక్ర వాహనం చివరి అంచున కూర్చోపెట్టుకొని ఓ చిన్నారిని తీసుకువెళ్లిన వ్యక్తి తీరు హడలుగొట్టింది. ఇది ప్రమాదకరమని చెప్పినా పట్టించుకోలేదు.
source:Eenadu