చిత్రం చెప్పే విశేషాలు..!
(09-02-2023/1)
అమరావతి జిల్లా తాడేపల్లిలోని సీఎం జగన్‌మోహన్ రెడ్డి నివాసానికి వేళ్లే మార్గంలో జాతీయరహదారి నుంచి తాడేపల్లి చేరే అండర్‌పాస్ వద్ద డ్రైనేజీ పరిస్థితి ఇది.
source:Eenadu
శ్రీకాకుళం జిల్లా మందసలోని శ్రీవాసుదేవస్వామి ఆలయంలో శుక్రవారం నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆలయాన్ని మందస సంస్థాన రాజపుత్ర వంశీయుల్లో ఒకరైన లక్ష్మణ రాజమణి రాజ్‌దేవ్ 1744లో పునఃప్రతిష్ఠించారు.
source:Eenadu
విశాఖ సాగరతీరంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు బుధవారం కొంతసేపు నడిచారు. ఆ సమయంలో తనను కలిసిన వారిని పలకరిస్తూ ముందుకు సాగారు.
source:Eenadu
కాంక్రీట్ జంగిల్‌లో చెట్లు లేక సీతాకోక చిలుకలు కనుమరుగవుతున్నాయి. హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీ ఫోర్త్ ఫేజ్‌లో ఏర్పాటు చేస్తున్న థీమ్‌పార్కులో ప్రత్యేకంగా సీతాకోకచిలుకల డిజైన్‌తో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు.
source:Eenadu
హైదరాబాద్‌లోని జేఎన్టీయూ మంజీరా మాల్ నుంచి కేపీహెచ్‌బీ కాలనీ టెంపుల్ బస్టాప్‌నకు వెళ్లే దారిలో చెట్టు కాండం, కొమ్మలకు పూర్తిగా చెదలు పట్టి ఓ వైపు వంగిపోయి ఉంది. ఎప్పుడు ఎవరి మీద పడుతుందో తెలియని పరిస్థితి.
source:Eenadu
హైదరాబాద్‌లోని ఆదిభట్లలో టీసీఎస్ ప్రాంగణంలో బుధవారం జాగ్వర్ టీసీఎస్ ఫార్ములా- ఈ కారును ప్రదర్శించారు. ఆ కారుతో టీసీఎస్ ప్రతినిధులున్నారు.
source:Eenadu
హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో బుధవారం ఈవీ-ఎక్స్‌పోను ప్రారంభించి బైకుపై కూర్చున్న మంత్రి కేటీఆర్.
source:Eenadu
దక్షిణ తుర్కియేలోని కహ్రామన్మారస్‌లో సోమవారం వచ్చిన భూకంపం కారణంగా నామరూపాల్లేకుండా ధ్వంసమైన భవనాలు
source:Eenadu
బిహార్ రాష్ట్రంలోని కైమూర్ జిల్లా రామ్‌గఢ్‌కు చెందిన ధర్మేంద్ర కుమార్ త్రిపుర రైఫిల్స్‌లో జవానుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈయన 165 కిలోల బరువును పళ్లతో ఎత్తి రికార్డు సృష్టించారు.
source:Eenadu
సిరియాలో శిథిలాల కింద తమ్ముడితో పాటు చిక్కుకున్న బాలిక. వీరిద్దరినీ సురక్షితంగా బయటకు తీశారు. ఈ చిత్రాన్ని ఐరాస ప్రతినిధి ట్విటర్‌లో పోస్టు చేశారు.
source:Eenadu