చిత్రం చెప్పే విశేషాలు..!

(11-02-2023/1)

ఈ ఏడాది ఆరంభం నుంచే వరిపైరుకు మొగితెగులు సోకి రైతులను ఇబ్బంది పెడుతుండగా.. పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలోని పంటపొలాలు ఇలా ఎండిపోతూ కనిపిస్తున్నాయి.

Source:Eenadu

తుర్కియేలో భారీ భూకంపంతో మృతి చెందిన వారికి శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం గాజులకొల్లివలస సంగమేశ్వరస్వామి కొండ వద్ద ఇలా సైకత శిల్పంతో గేదెల హరికృష్ణ(సైకత శిల్పి) నివాళులర్పించారు.

Source:Eenadu

 మొక్కలకు సక్రమంగా నీరందకపోతే ఎండిపోయే పరిస్థితి తలెత్తింది. ఇందుకు సిద్దిపేట గ్రామీణ మండలం పుల్లూరు జడ్పీ పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, సర్పంచి నరేశ్‌ చొరవతో మొక్కలకు నీటి సీసాలు కట్టి వాటిలో నీరు పోశారు.

Source:Eenadu

వరంగల్‌ జిల్లా ములుగురోడ్డులోని ఆఫ్‌ సీజన్ నర్సరీలో మొక్కజొన్నలపై పరిశోధనలు జరుగుతున్నాయి. అక్కడ తెల్లజొన్న కంకులకు రక్షణగా కవచాల మాదిరిగా కట్టారు.

Source:Eenadu

ఈ చిత్రం చూస్తుంటే రోడ్డంతా స్వర్ణం పరుచుకున్నట్లు ఉంది కదూ.. హనుమకొండలోని బ్యాంకు కాలనీ నుంచి టీచర్స్‌ కాలనీకి వెళ్లే మార్గంలో సీసీ రోడ్డు వేశారు. క్యూరింగ్ కావడానికి దారి మొత్తం వరిగడ్డి వేసి నీళ్లు చల్లడంతో ఆ రోడ్డు మొత్తం బంగారు వర్ణంతో కనిపిస్తోంది.

Source:Eenadu

విజయవాడ గుణదల కొండపై నిర్వహిస్తున్న మేరీమాత ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. అధిక సంఖ్యలో తరలివచ్చిన విశ్వాసులు కొండపై శిలువ వరకు మెట్లు ఎక్కి మొక్కులు తీర్చుకున్నారు.

Source:Eenadu

 అమరావతిలోని ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్లలో పదకొండో రోజు శుక్రవారం సిడిబండి ఉత్సవం వైభవంగా నిర్వహించారు. 

Source:Eenadu

జాతి వైరాన్ని మరిచిన ఓ శునకం మార్జాలానికి పాలిస్తోంది. ఖమ్మం జిల్లా, పాల్వంచ మండలం రంగాపురంలో ఈ దృశ్యం కెమెరా కంటికి చిక్కింది. 

Source:Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(22-07-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(21-07-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(21-07-2025)

Eenadu.net Home