చిత్రం చెప్పే విశేషాలు..!
(12-02-2023/1)
భూకంపం ధాటికి అతలాకుతలమైన తుర్కియేలోని కహ్రామన్మారస్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు.
Source.Eenadu
భూకంప బాధితుల కోసం తుర్కియేలోని గాజియాన్‌తెప్‌లో ఓ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక గుడారాలు.
Source.Eenadu
హతాయ్‌లో భవన శిథిలాల నుంచి బయటపడిన శునకానికి నీరు తాగిస్తున్న సహాయక సిబ్బంది.
Source.Eenadu
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం శ్యాంపూర్‌లోని మురళీధర్ ఇంటి ఆవరణలో ఉన్న పాదుకు ఏకంగా మూడు, నాలుగు అడుగులకుపైనే పొడవుతో కాయలు కాస్తున్నాయి.
Source.Eenadu
నిబంధనలకు విరుద్ధంగా.. వాహనాలు పరిమితికి మించి ప్రయాణికులను రవాణా చేస్తూ.. ప్రమాదాలను ఆహ్వానిస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని గంగారం-దామెరకుంటకు మధ్యలో ప్రయాణికులు ఇలా ప్రమాదకరంగా ఆటో పైకెక్కి ప్రయాణిస్తున్నారు. Source.Eenadu
పర్యాటకులను ఆకట్టుకునేందుకు కశ్మీర్‌లోని బారాముల్లాలో ఏర్పాటు చేసిన ఇగ్లూ కేఫ్ ఇది. గుల్మార్గ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఇలాంటి కేఫ్‌లను అందుబాటులోకి తెచ్చింది.
Source.Eenadu
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం వ్యారారం గ్రామ పొలిమేరలో చిత్తరిగుట్టపైన ఆదిమానవుని కాలంనాటి వర్ణ చిత్రాలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం గుర్తించింది.
Source.Eenadu
ఈ నెల 14న ప్రేమికుల దినోత్సవం నేపథ్యంలో వ్యాపారులు రకరకాల బహుమతులను విక్రయాలకు సిద్ధం చేస్తున్నారు. విశాఖ నగరంలోని ఓ దుకాణంలో ప్రేమ చిహ్నాలతో ఏర్పాటు చేస్తున్న తోరణాలు ఆకట్టుకుంటున్నాయి. Source.Eenadu