చిత్రం చెప్పే విశేషాలు..!
(14-02-2023/1)
గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ పరిధిలో విల్లివాక్కం చెరువులో ఏర్పాటు చేసిన అద్దాల వంతెన. ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. స్మార్ట్‌సిటీ మిషన్‌లో భాగంగా ఈ పనులు దాదాపు పూర్తయ్యాయి.
source:eenadu
శంషాబాద్ విమానాశ్రయం అంతర్జాతీయ టర్మినల్‌లో అర్ధరాత్రి 2 గంటల సమయంలో పరిస్థితి ఇది. ఆర్థిక మాంద్యం భయాలు, ఉద్యోగాల తొలగింపులు ఉన్నా ఉన్నత చదువులు, కొత్త కొలువులను వెతుక్కుంటూ వెళ్తున్న వారి సంఖ్య తగ్గడం లేదు.
source:eenadu
హైదరాబాద్ నగరంలో సైక్లింగ్‌ను ప్రోత్సహించేందుకు వివిధ ప్రాంతాల్లో నిర్మించిన ట్రాక్‌లు నిరుపయోగంగా మారుతున్నాయి.
source:eenadu
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భారత మాజీ క్రికెటర్లు, కన్నడ సినీ ప్రముఖులు మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. బెంగళూరు రాజ్‌భవన్‌లో విడిది చేసిన ప్రధానిని మాజీ క్రికెటర్లు అనిల్ కుంబ్లే, జవగళ్ శ్రీనాథ్, వెంకటేశ్ ప్రసాద్ తదితరులు కుటుంబసభ్యులతో వచ్చి కలిశారు.
source:eenadu
పెరూలోని శాన్‌జువాన్‌డిలో ఓ బ్రిడ్జిపై ప్రజలు ఇలా అత్యంత ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారు. కొన్ని రాజకీయ నిర్ణయాలతో ఆ వారధిపై వెళ్లేందుకు ఆంక్షలు విధించినా పట్టించుకోవడం లేదు.
source:eenadu
వారణాసిలోని శ్రీ కాశీ విశ్వనాథ్ ఆలయంలో సోమవారం పరమశివుడికి అభిషేకం చేస్తున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇతరులు
source:eenadu
తుర్కియేలో భవన శిథిలాల కింద చిక్కుకున్న బెరెన్ అనే ఓ ఆరేళ్ల బాలికను రక్షించించడంతో ఎన్డీఆర్‌ఎఫ్‌కు చెందిన రోమియో, జూలీ అనే రెండు జాగిలాలు హీరోలయ్యాయి.
source:eenadu
హైదరాబాద్ హుస్సేన్‌సాగర్ తీరంలో ఉన్న రావి చెట్లివి. ఇలా ఒక్క ఆకు కూడా లేకుండా కనిపిస్తుండటానికి కారణం.. బొంత పురుగులు. ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం రావి చెట్లపై బొంత పురుగులు దాడి చేశాయి.
source:eenadu
బెంగళూరులో నిర్వహించిన ఏరో ఇండియా ప్రదర్శనలో తేలికపాటి పోరాట హెలికాప్టర్ విన్యాసాలు.
source:eenadu