చిత్రం చెప్పే విశేషాలు..!

(16-02-2023/1)

ప్రత్యేక రంగులో గుత్తులుగా పూలు పూసిన మోదుగ చెట్లు ప్రకృతికి మరింత వన్నె తీసుకువస్తున్నాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం దేవుల తిర్మలాపూర్‌లో నిండుగా పూలు పూసి కనువిందు చేస్తున్న మోదుగ చెట్టు.

source:eenadu

రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని శ్రీశివగంగా రాజరాజేశ్వరస్వామి ఆలయం ఉత్సవాల నేపథ్యంలో ప్రత్యేక శోభను సంతరించుకుంది. 

source:eenadu

 కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామ పరిధి ఘన్‌పూర్‌ శివారులో రెండు ఇప్ప చెట్ల కొమ్మలు ఒకదానికొకటి పూర్తిగా కలిసిపోయి చూపరులను ఆకట్టుకుంటున్నాయి. 

source:eenadu

ఒక పక్క ఎక్కడో ఓ చోట తరచూ రైలు ప్రమాదాలు జరుగుతున్నా కొందరు మాత్రం మారడం లేదు. ఓ తల్లి ఇద్దరు చిన్నారులను హైదరాబాద్‌లోని సీతాఫల్‌మండి రైల్వేస్టేషన్‌లో ఆగి ఉన్న రైలు బోగి కింది నుంచి తీసుకెళ్లింది.

source:eenadu

విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌ వస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌ బీబీనగర్‌ సమీపంలోని అంకుషాపూర్‌ వద్ద పట్టాలు తప్పింది. యుద్ధప్రాతిపాదికన ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఏ ప్లాట్‌ఫామ్‌ చూసినా ప్రయాణికులతో కిక్కిరిసిపోయిఉంది. 

source:eenadu

సినీ నటి అనుపమ పరమేశ్వరన్ బుధవారం విజయవాడలో సందడి చేశారు. ఓ ప్రైవేటు కార్యక్రమానికి వచ్చిన ఆమె అభిమానులను అలరించారు.

source:eenadu

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ వ్యక్తిగత పనుల మీద బుధవారం కశ్మీర్‌ లోయకు చేరుకున్నారు. గుల్మార్గ్‌లో స్కీయింగ్‌ చేస్తూ ఉల్లాసంగా గడిపారు.

source:eenadu

జనగామ జిల్లా పాలకుర్తిలో పాదయాత్ర చేస్తున్న షర్మిలను పాలకుర్తి మండలం లక్ష్మీనారాయణపురం శివారులో ఓ గీత కార్మికుడి కోరిక మేరకు షర్మిల నీరా రుచి చూశారు.

source:eenadu

చిత్రం చెప్పేవిశేషాలు(22-07-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(22-07-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(21-07-2025)

Eenadu.net Home