చిత్రం చెప్పే విశేషాలు..!

(19-02-2023/1)

విశాఖలోని వుడా పార్కు వెనుక భాగం సముద్ర తీరంలో బర్నాకిల్స్‌ అనే సముద్ర జీవులు కనిపించాయి. సముద్రం వెనక్కి వెళ్లడంతో రాళ్లకు అతుక్కొని బయటపడ్డాయి. ఇవి రొయ్య జాతికి చెందినవి. బయటకు కనిపించడం అరుదు..

Source.Eenadu 

దక్షిణాఫ్రికా నుంచి మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చేరుకున్న చీతాలు ఉన్న పెట్టెలు. 

Source.Eenadu 

పర్యాటకులు అల్లూరి సీతారామరాజు జిల్లా పేరంటాళ్లపల్లి రేవులో దిగగానే, తల పూర్తిగా పైకి ఎత్తి చూసేంత ఎత్తులో ఈ చెట్టు ఉంది. ఇక్కడి నుంచి పాపికొండల వీక్షణ కోణం అత్యంత రమణీయంగా ఉంటుంది. 

Source.Eenadu

బెంగళూరు నగర శైవక్షేత్రాలు భక్తులతో కిక్కిరిసి పోయాయి. తెల్లవారు జాము నుంచే తలుపులు తెరచి, సర్వజన దర్శనానికి శ్రీశివమూర్తిని సిద్ధం చేయడంతో పాత విమానాశ్రయ మార్గం మురుగేశ్‌పాళ్యలో పోటెత్తిన భక్తులు.. నయనానందకర వేడుకల దృశ్యమిదీ.

Source.Eenadu

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గజ్వేల్‌కు చెందిన రామకోటి భక్తసమాజం వ్యవస్థాపకుడు రామకోటి రామరాజు 51 కిలోల అక్షింతల(పసుపు బియ్యం)తో శివయ్య చిత్రాన్ని రూపొందించి భక్తిభావాన్ని చాటుకున్నాడు.

Source.Eenadu

నిర్మల్ జిల్లా దస్తూరాబాద్‌ మండలంలోని రేవోజిపేట గ్రామంలో ఓ కోడి ఎనిమిది పిల్లలు చేయగా అందులో ఒకటి నాలుగు కాళ్లతో జన్మించింది. దీన్ని చూసి అందరూ ఆశ్యర్యపోతున్నారు..

Source.Eenadu

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మాకవరపాలెం మండలం తూటిపాలకు చెందిన సూక్ష్మ కళాకారుడు బి.రవికుమార్‌ తోటకూర గింజలతో దర్శకుడు కె.విశ్వనాథ్‌ ముఖచిత్రాన్ని వేసి ఆకట్టుకున్నాడు.

Source.Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు(22-07-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(22-07-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(21-07-2025)

Eenadu.net Home