చిత్రం చెప్పే విశేషాలు..!
(22-02-2023/1)
నగరంలో ఎండలు పెరుగుతున్నాయి. వేడికి అలసిపోతున్న ప్రయాణికులు మాదాపూర్, హైటెక్‌సిటీ మార్గంలో కాస్త నీడ కనిపిస్తే చాలు అక్కడ సేద దీరుతున్నారు.
source:eenadu
కొందరు చిరువ్యాపారులు ఫుట్‌పాత్‌లనే కాదు.. వాటిపై ఏర్పాటు చేసిన చెత్త డబ్బాలనూ పుస్తక విక్రయ కేంద్రాలుగా మార్చారు. అబిడ్స్ చౌరస్తాలోని దృశ్యమిది.
source:eenadu
కూకట్‌పల్లిలో మెట్రో మాల్ ముందు ఓ భారీ భవనంపై ఈ యువకులు రక్షణ చర్యలు తీసుకోకుండా పనులు చేస్తూ కనిపించారు. పడితే ప్రాణాలకు ప్రమాదమే కదా..!
source:eenadu
వేసవిలో మంచిరాబడి ఉంటుందని దోస పంట వేసిన అనంతపురం రైతులకు నిరాశే మిగిలింది. ఆరుగాలం కష్టించి పండించిన పంటను పొలంలోనే వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
source:eenadu
పట్టణంలోని చీపురుపల్లి రోడ్డులో ఉన్న అభయాంజనేయ స్వామివారి ఆలయంలో మంగళవారం ఉత్తరాయణ పాఢ్యమి సందర్భంగా స్వామివారికి అయిదు వేల తమలపాకులతో అలంకరించి, సప్తవర్ణ పుష్పాలతో ప్రత్యేక పూజలు చేశారు.
source:eenadu
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా సీతంపేట మండలంలోని పూతికవలస గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల విద్యార్థులు ‘అ’ ‘తెలుగు’ అక్షరాల ఆకారంలో కూర్చొని ఆకట్టుకున్నారు.
source:eenadu
రెండేళ్లుగా మామిడి కాపు అంతంతమాత్రంగా ఉండటంతో చంద్రగిరి రైతులు నష్టాలు చవిచూశారు. ఈ ఏడాది మామిడితోటలు పూతతో కళకళ లాడుతున్నాయి.
source:eenadu
జలాలపై ప్రసరించిన బంగారు వర్ణపు సూర్యోదయ కాంతి చిత్తూరు కట్టమంచి చెరువు వద్ద మంగళవారం ఉదయం కనిపించిన ఈ దృశ్యం నగరవాసుల్ని ఆకట్టుకుంది.
source:eenadu