చిత్రం చెప్పే విశేషాలు..!

(23-02-2023/1)

సాలూరు మండలంలోని తోణాం పంచాయతీ ముంగివానివలస ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఇది. గతంలో ఇక్కడ 8 మంది వరకు చదివేవారు. విలీన ప్రక్రియ ముగిశాక ఇక్కడ మిగిలిన ఇద్దరు ఒకటో తరగతి విద్యార్థులకు ఉపాధ్యాయుడు పాఠాలు బోధిస్తున్నారు.

source:eenadu

తిలారు రైలు నిలయంలోని కాలినడక పైవంతెన శిథిలావస్థకు చేరుకోవడంతో సుమారు నెల రోజుల నుంచి దానిపై రాకపోకలను నిలిపివేశారు. అప్పటి నుంచి ప్రయాణికులు 3, 4 నంబరు ప్లాట్‌ఫారాలకు వెళ్లేందుకు ఇలా పట్టాలు దాటుతున్నారు.

source:eenadu

పాయకరావుపేట పట్టణం దుర్గా కాలనీలో భారీ గుడ్లగూబ కనిపించింది. సమీపంలోని కొండ ప్రాంతం నుంచి బుధవారం కాలనీలోకి వచ్చిన దీన్ని పిల్లలు పట్టుకున్నారు. 

source:eenadu

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో విగ్రహాలకు ముసుగులేసే కార్యక్రమానికి సిబ్బంది శ్రీకారం చుట్టారు. కొందరు అత్యుత్సాహంతో నర్సీపట్నంలో సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదురుగా ఉన్న విప్లవ వీరుడు అల్లూరి సీతారామారాజు విగ్రహాన్నీ వదిలిపెట్టలేదు.

source:eenadu

హైదరాబాద్‌లోని చిలుకానగర్‌లో బొడ్రాయి వద్ద పూడిక తీసి తరలించలేదు. మురుగు కాలువ పైకప్పు వేయలేదు. రాత్రి సమయంలో కాలనీవాసులు అందులో పడిపోతున్నారు.

source:eenadu

ఒకప్పుడు హైదరాబాద్‌ నగర ప్రజలకు తాగునీరు అందించిన మూసీ నది ఇదేనంటే నమ్మగలరా..? పరిశ్రమల వ్యర్థాలు నేరుగా వచ్చి చేరడంతో హైకోర్టు 

ముందు నురగలు కక్కుతూ ప్రవహిస్తోంది.

source:eenadu

స్వయంభూ క్షేత్రమైన యాదాద్రిలో బుధవారం ధ్వజారోహణం, రాత్రి నిర్వహించిన దేవతాహ్వాన పర్వాలతో శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు రెండో రోజుకు చేరాయి.

source:eenadu

ఉక్రెయిన్‌లోని ఖేర్సన్‌లో స్వచ్ఛంద సంస్థలు పంపిణీ చేసే ఆహారం కోసం వరసలో నిల్చున్న స్థానికులు.

source:eenadu

చిత్రం చెప్పేవిశేషాలు(22-07-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(22-07-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(21-07-2025)

Eenadu.net Home