చిత్రం చెప్పే విశేషాలు..!
(26-02-2023/1)
గంజాం జిల్లా రుషికుల్యా సాగర తీరంలో ఆలివ్ రిడ్లీ సామూహికంగా గుడ్లు పెడుతున్నాయి. కొత్త పోడమ్మ పేట నుంచి బటేశ్వర వరకూ ఉన్న తీరంలో ఈ ప్రక్రియ సాగుతోంది.
source:eenadu
అల్లూరి సీతారామరాజు జిల్లా యు.చీడిపాలెం పంచాయతీ పలకజీడి సమీపంలోని కాలువపై వంతెన లేకపోవడంతో గంగవరం, ఎర్రగొండ, నీలవరం తదితర గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఏడాదిన్నర క్రితం ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి నిధులు మంజూరు చేసినా నేటికీ పనులు ప్రారంభం కాలేదు.
source:eenadu
ఇంద్రకీలాద్రి సమీపంలో సుందర దృశ్యం ఆవిష్కృతమైంది. శనివారం 9 గంటల వరకు కురిసిన పొగమంచు కృష్ణానది మీదుగా ప్రకాశం బ్యారేజిని కప్పేసింది.
source:eenadu
హైదరాబాద్‌లోని ఇబ్రహీంపట్నం వద్ద బస్సులో ప్రయాణికులు కిక్కిరిసి వెళ్లారు. ఇదంతా బస్సులు తక్కువగా ఉండడమే కారణమని విద్యార్థులు చెబుతున్నారు.
source:eenadu
హైదరాబాద్: శామీర్‌పేటలోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో శనివారం 19వ స్నాతకోత్సవం నిర్వహించారు. 258 మందికి పట్టాలు ప్రదానం చేశారు. టోపీలు ఎగురవేసి విద్యార్థినులు సందడి చేశారు.
source:eenadu
హైదరాబాద్‌లోని బయోడైవర్సిటీ వెనుక కొండపై తాత్కాలిక గుడారాల్లో ఉండే కూలీలు వీరు. అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లడానికి దగ్గరి దారి కావడంతో కొండపై నుంచి తాళ్లు కట్టుకొని రాకపోకలు సాగిస్తున్నారు.
source:eenadu
ఒకరి వెనుక ఒకరు కుక్కుకుని కూర్చున్న వీరంతా మాదకద్రవ్యాల మాఫియా ముఠాల సభ్యులు. ఎల్ సాల్వెడార్‌లో అరెస్టయ్యారు. అతిపెద్ద జైలుకు 2,000 మంది ఖైదీలను తరలించిన సందర్భంలో తీసిన చిత్రమిది.
source:eenadu
కాలిఫోర్నియాలోని అల్పైన్ మీడోస్ పార్కింగ్ ప్రాంతంలో పేరుకుపోయిన మంచు.
source:eenadu