చిత్రం చెప్పే విశేషాలు..!
(15-03-2023/1)
శ్రీకాకుళం జిల్లాలోని బాతుపురం సమీపంలో రైతు అప్పలస్వామికి చెందిన తోటలో పనస చెట్టు విరగ కాసింది. చెట్టు మొదలు నుంచి కాండంపై వరకు దాదాపు 80 కాయలు గుత్తులుగా కనిపిస్తున్నాయి.
source:eenadu
నారాయణపేట జిల్లా కోస్గి మండల కేంద్రం నుంచి పోలేపల్లికి వెళ్లే మార్గంలో చింతచెట్టు చూపరులను ఆకట్టుకుంటుంది. చెట్టు సగభాగం చిగురించింది. మరో సగభాగం మోడువారింది.
source:eenadu
చిత్రంలో అక్కడక్కడా మచ్చల్లా కనిపిస్తున్నవి ఏమిటో తెలుసా? ఇసుక దిబ్బలు. అయితే ఇవి అంగారక గ్రహం మీదవి. నాసాకు చెందిన మార్స్ రికానిసెన్స్ ఆర్బిటర్ పంపిన చిత్రమిది.
source:eenadu
బేగంపేట-అమీర్‌పేట రోడ్డులో రిటైల్ వ్యాపారులు ట్రాలీ ఆటోల్లో ఉల్లిగడ్డలు విక్రయిస్తున్న చిత్రమిది. నగరంలో రూ.15-20 పలుకుతుండగా..రైతులకు రూ.2-4 మాత్రమే దక్కుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
source:eenadu
రోజురోజుకీ ముదురుతున్న ఎండలకు దాహంతో అలమటించి పోతున్న ఓ శునకం ప్లాస్టిక్ డబ్బాలో ఉన్న నీరు తాగేందుకు తలదూర్చడంతో డబ్బాలో ఇరుక్కుపోయింది. ప్రాణభయంతో పరుగులు పెడుతూ ఎర్రమంజిల్-బంజారాహిల్స్ రోడ్డుపై కనిపించింది.
source:eenadu
ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కృషి చేస్తున్నారు. హంద్రీనీవాకు నీటి సరఫరా నిలిచిపోయిన సమయంలో రైతుల తరఫున పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టి నీటి తరలింపునకు ఏర్పాటు చేశారు.
source:eenadu
వివేకానందనగర్‌కాలనీ జంక్షన్ సమీపంలో జాతీయ రహదారి పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన షోరూంలో మంగళవారం రూపదర్శినులు సందడి చేశారు.
source:eenadu
ఈ పక్షుల దృశ్యాలు చూస్తే ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలోని నాటు.. నాటు.. పాటకు కథానాయకులు స్టెప్పులేసినట్లు ఉంది కదూ..! మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా పెన్‌గంగా పరివాహాక ప్రాంతాల్లో పక్షులు ఇలా కనిపించాయి.
source:eenadu