చిత్రం చెప్పే విశేషాలు..!

(14-01-2023/2)

కూకట్‌పల్లి మలేషియన్ టౌన్‌షిప్‌లో సంక్రాంతి వేడుకల్లో భాగంగా కైట్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నాపెద్దలు గాలిపటాలు ఎగురవేసి సంబరాలు చేసుకున్నారు.

source:eenadu

పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఓ కళాశాల విద్యార్థినులు.

source:eenadu

ఒడిశాలోని సోన్‌పూర్‌ జిల్లా కేంద్రంలోని క్రీడా మైదానంలో తవుడుతో 4682 అడుగుల పొడవైన ప్రపంచ హాకీ కప్‌ ట్రోఫీ ఆకారంతో పాటు చక్‌ దే ఇండియా అక్షరాలను ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ తీర్చిదిద్దారు. 

source:eenadu

విశాఖలోని బీచ్‌రోడ్డులో ఏర్పాటు చేసిన టన్నెల్‌ అక్వేరియంలో కొన్ని చేపలు సందర్శకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్నాయి. వాటిలో ఒకటి ఈ ఎలక్ట్రిక్‌ ఈల్‌ చేప. దీన్ని పట్టుకుంటే కరెంట్‌ షాక్‌ కొట్టినట్టే ఉంటుంది.

source:eenadu

మూడు తలలతో ఉన్న కొబ్బరి చెట్టు తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలంలోని నిలువురాళ్ల కమ్మపల్లిలో ఉంది. అల్లూరు బతుకమ్మ నాయుడు పొలంలో ‘వై’ ఆకారంలో చెట్టు పెరిగితే ఒక వైపు కాండంపైనుంచి మరో చెట్టు వచ్చింది.

source:eenadu

నీలి ఆకాశం కాస్త ఎరుపు రంగులోకి మారి శుక్రవారం సాయంత్రం కనువిందు చేసింది..చిత్తూరు సోమల మండలం పొదలకుంట్లపల్లి సమీపంలో చెరువు సమీపంలోని దృశ్యమిది.

source:eenadu

పర్యాటకులను ఆకర్షించేలా విశాఖపట్నం, మధురవాడ ‘శిల్పారామం (జాతర)’లో ‘ది వాటర్‌ పార్క్‌’ ప్రారంభమైంది. 

source:eenadu

వరంగల్‌ చారిత్రక శైవక్షేత్రం ఐనవోలు మల్లికార్జునస్వామి జాతర ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. 

source:eenadu

ఖమ్మం జిల్లాలో కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం బస్తాలను అధికారులు తల్లాడ మండలంలోని మిల్లులకు లారీలు, ట్రాక్టర్లు ద్వారా భారీ మొత్తంలో తరలించారు. 

source:eenadu

హైదరాబాద్‌లో ఉదయం, రాత్రివేళల్లో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో నగరాన్ని మంచు దుప్పటి కప్పేసింది. ఉదయం 10 వరకు చల్లగాలులు వీస్తుండటంతో బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.

source:eenadu

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ‘మాఘ్‌ మేళా’ ఉత్సవాలను పురస్కరించుకుని ఓ సాధువు జడలు కట్టిన తన జుట్టుపై ఇలా గోధుమ మొక్కలను పెంచుకున్నారు.

source:eenadu

హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌ వద్ద కారుపై కనిపిస్తున్న ఈ పరికరం పేరు స్ట్రీం గ్రౌండ్‌ పెనెట్రేటింగ్‌ రాడార్‌. దీని చుట్టూ, పైన ఉన్న ఏడు కెమెరాలు, సెన్సార్స్‌తో రహదారి నిర్మాణంలో ఎత్తు, పల్లాల సమాచారం సేకరిస్తారు. 

source:eenadu

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home