చిత్రం చెప్పే విశేషాలు..!

(24-01-2023/2)

నిజామాబాద్‌-మాక్లూర్‌ మండలం గాలీబ్‌నగర్‌ శివారులో నిజామాబాద్‌ - నందిపేట రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలు వృక్షాలుగా ఎదిగి నీడనిస్తున్నాయి.

source:EENADU

హైదరాబాద్, మెహిదీపట్నం అత్తాపూర్‌ రోడ్డులో భోజగుట్ట ప్రాంతంలో కొందరు పిల్లలు భారీ కొండ రాళ్లపై నిల్చుని ప్రమాదకరంగా పతంగి ఎగురవేస్తున్న చిత్రమిది. 

source:EENADU

సినీనటి లావణ్య త్రిపాఠి తిరుమల శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

source:EENADU

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ర్యాలీలో పాల్గొన్నారు.

source:EENADU

బేగంపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్‌ మహిళా కళాశాలలో మీడియాస్ఫేర్‌ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్సీ కవిత హాజరై విద్యార్థినులతో సెల్ఫీ దిగి సందడి చేశారు.

source:EENADU

ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్‌లో నాగోబా జాతర ఘనంగా నిర్వహిస్తున్నారు. సంప్రదాయ నృత్యాలతో ఆదివాసీలు ఆకట్టుకుంటున్నారు.

source:EENADU

నాగోబా జాతరలో మంత్రులు ఇంద్రకర్‌ణ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

source:EENADU

విజయవాడలో ‘బుక్‌ ఎగ్జామ్‌ వారియర్స్‌’కార్యక్రమం నిర్వహించారు. గవర్నర్‌ బిష్వభూషన్‌ హరిచందన్‌ పాల్గొని జ్యోతి వెలిగించారు.

source:EENADU

హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ చార్టెడ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియాను నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి అర్జున్‌ రాం మేఘవాల్‌ పాల్గొని ప్రసంగించారు.

source:EENADU

దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్‌ తొలి విడత పరీక్ష మంగళవారం నిర్వహించారు. ఈ పరీక్ష రాసేందుకు విజయవాడకు వచ్చిన అభ్యర్థులు.

source:EENADU

చిత్రం చెప్పే విశేషాలు (24-04-2024/1)

బెంగళూరులో వర్షాలు.. ప్రణీత సంబరాలు

చిత్రం చెప్పే విశేషాలు (23-04-2024/1)

Eenadu.net Home