చిత్రం చెప్పే విశేషాలు..!
(25-01-2023/2)
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో నీరూస్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు మోడల్స్ హాజరై నూతన డిజైనర్ దుస్తులతో ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.
source:EENADU
గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో అహ్మదాబాద్‌లోని ఓ పాఠశాల విద్యార్థినులు మువ్వన్నెల రంగుల దుస్తులు ధరించి మురిసిపోయారు.
source:EENADU
జర్మనీలోని ఫెల్డ్‌బర్గ్ పర్వత శిఖరంపై దట్టంగా మంచు కురిసింది. దీనికితోడు చుట్టుపక్కల పొగమంచు మేఘాల మాదిరిగా పరుచుకొని ఉంది. సూర్యోదయం వేళ ఈ దృశ్యం ఎంతో రమణీయంగా కనిపించింది.
source:EENADU
తెదేపా హయాంలో ప్రవేశపెట్టిన ‘యువనేస్తం’ నిరుద్యోగ భృతి పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ గుంటూరులో తెలుగు యువత ఆధ్వర్యంలో గేదెలతో వినూత్న నిరసన తెలిపారు.
source:EENADU
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జనవరి 27న కుప్పం నుంచి ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో మామ బాలకృష్ణ ఆశీర్వాదం తీసుకున్నారు.
source:EENADU
హైదరాబాద్ రామాంతాపూర్‌లోని మేఘ జూనియర్ కళాశాలలో వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు నృత్య ప్రదర్శనలతో పాటు ర్యాంప్‌వాక్ చేసి ఆకట్టుకున్నారు.
source:EENADU
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో నాగోబా జాతర ఘనంగా సాగుతోంది. బుధవారం ఆదివాసీలు ఆలయంలో సంప్రదాయ బేతల్ పూజలను నిర్వహించారు.
source:EENADU
విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘వారసుడు’ సంక్రాంతి కానుకగా విడుదలైంది. ఈ నేపథ్యంలో చిత్రబృందమంతా కలిసి విజయోత్సవ సంబరాలు చేసుకుంది.
source:EENADU
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. తన వారాహి వాహనానికి అక్కడ పూజలు చేయించారు.
source:EENADU
కరీంనగర్‌లో బుధవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో తిరంగా రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా నగరవాసులు, యువత పాల్గొని భారీ జాతీయ జెండాతో ప్రదర్శన చేశారు.
source:EENADU
కరీంనగర్‌లో మార్వాడీలు శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు తలపై టెంకాయలు పెట్టుకొని భగవంతుడి నామస్మరణ చేశారు.
source:EENADU
ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం 165 పశు అంబులెన్స్ వాహనాలను తన క్యాంపు ఆఫీస్ నుంచి జెండా ఊపి ప్రారంభించారు.
source:EENADU