చిత్రం చెప్పే విశేషాలు..!

(29-01-2023/2)

 శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని, కీర్తి సురేష్‌ జంటగా తెరకెక్కిన సినిమా ‘దసరా’. ఈ సినిమా టీజర్‌ను సోమవారం విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది.

source:eenadu

ఆస్ట్రేలియా గాయని, నటి డెల్టా గుడ్‌రెమ్‌ లాస్ఏంజెల్స్‌లో నిర్వహించిన ‘జీ డే.. యూఎస్‌ ఆర్ట్స్ గాలా’ కార్యక్రమానికి హాజరై ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.

source:eenadu

ఆస్ట్రేలియా ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ ఛాంపియన్‌, బెలారస్‌ క్రీడాకారిణి సబలెంక ఆస్ట్రేలియాలోని రాయల్‌ బొటానికల్‌ గార్డెన్స్‌లో ట్రోఫీతో ఫొటోలు దిగుతూ సందడి చేశారు. 

source:eenadu

హైదరాబాద్‌లోని దుర్గం చెరువు వద్ద 21కె, 10కె, 5కె రన్‌ నిర్వహించారు. నగరవాసులు పెద్దఎత్తున పాల్గొని సందడి చేశారు.

source:eenadu

తన తల్లి అంజనాదేవికి చిరంజీవి ట్విటర్‌ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పవన్‌కల్యాణ్‌, నాగబాబు, రామ్‌చరణ్‌లతో కలిసి జన్మదిన వేడుకలు నిర్వహించిన ఫొటోలను ఆయన పంచుకున్నారు. 

source:eenadu

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి భవన్‌లో ‘అమృత్‌ ఉద్యాన్‌’ను ప్రారంభించారు. ఇక్కడి అందాలను వీక్షించేందుకు ఈ నెల 31 నుంచి మార్చి 26 వరకు సందర్శకులకు అనుమతినిచ్చారు. 

source:eenadu

నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెరువుగట్టులో జడల రామలింగేశ్వర స్వామి కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి వేడుకను వీక్షించారు.

source:eenadu

రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌జోడో యాత్ర శ్రీనగర్‌లో ముగిసింది. ఈ నేపథ్యంలో రాహుల్‌ గాంధీ అక్కడి లాల్‌చౌక్‌ వద్ద భారత జాతీయ జెండాను ఆవిష్కరించారు.

source:eenadu

నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్నను చూసేందుకు సినీనటులు ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ తమ కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో బెంగళూరు చేరుకున్నారు.

source:eenadu

చిత్రం చెప్పేవిశేషాలు(21-07-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(21-07-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(20-07-2025)

Eenadu.net Home