చిత్రం చెప్పే విశేషాలు..!
(05-02-2023/2)
హుస్సేన్‌సాగర్ తీరంలోని పీపుల్స్ ప్లాజా వద్ద ఎలక్ట్రిక్ వాహనాల ర్యాలీ నిర్వహించారు. అనంతరం బైక్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
source:Eenadu
దివంగత దర్శకుడు, కళాతపస్వి కె. విశ్వనాథ్ కుటుంబ సభ్యులను తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు. అనంతరం విశ్వనాథ్ చిత్రపటానికి ఆయన పూలమాల వేసి నివాళి అర్పించారు.
source:Eenadu
హీరో అల్లు అర్జున్ తన కుమారుడు అయాన్ ఇచ్చిన ఓ అందమైన బహుమతి ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘ నా సోల్.. అయాన్ బాబు నుంచి అందమైన బహుమతి’ అని బన్నీ పొంగిపోయారు.
source:Eenadu
మాఘ పౌర్ణమి సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో పుణ్యస్నానానికి భక్తులు పోటెత్తారు. గంగా, యమునా నదుల సంగమం వద్ద ఉన్న పాంటూన్ వంతెనపై భక్తులు కిక్కిరిసిపోయారు.
source:Eenadu
రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్ఏగా బాధ్యతలు తీసుకున్న నవీన్ మిట్టల్ సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
source:Eenadu
దెందులూరు మండలం గాలయగూడెంలోని అచ్చమ్మ పేరంటాలు తల్లి దర్శనానికి భక్తులు పోటెత్తారు.
source:Eenadu
భారాస బహిరంగ సభలో భాగంగా సీఎం కేసీఆర్ నాందేడ్‌లోని గురుద్వారాకు చేరుకున్నారు.
source:Eenadu
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తన తాజా ఫొటోను ట్విటలో పంచుకున్నారు. ఈ డ్రెస్సులో ఆమె ఓ రాణిలా ఉన్నట్లు ఫొటోతో తెలుస్తోంది.
source:Eenadu
తిరుమల నూతన పరకామణి భవనంలో హుండీ కానుకల లెక్కింపును ప్రారంభించారు. తితిదే భవనంలో ప్రత్యేక పూజలు, హోమాలు, గోప్రవేశం చేసిన అనంతరం రెండు వందల మంది ఈ హుండీ లెక్కింపులో పాల్గొన్నారు.
source:Eenadu