చిత్రం చెప్పే విశేషాలు..!

(09-02-2023/2)

కల్యాణ్‌ రామ్‌, ఆషికా రంగనాథ్‌ జంటగా రాజేంద్రరెడ్డి దర్శకత్వంలో ‘అమిగోస్‌’ నిర్మితమైంది. ఈ సినిమాలో కల్యాణ్‌రామ్‌ త్రిపాత్రాభినయం చేశారు. ప్రీ రీలిజ్‌ ప్రెస్‌ మీట్‌లో కల్యాణ్‌రామ్‌, ఆషికా ఇలా మెరిశారు.

source:Eenadu

విశాఖలోని అంబేడ్కర్‌ జంక్షన్‌ నుంచి రైల్వే స్టేషన్‌ మార్గంలో అల్లిపురం వద్ద ప్రహరీలను జీవీఎంసీ ఆధ్వర్యంలో రంగు రంగుల చిత్రాలతో అందంగా అలంకరించారు. 

source:Eenadu

తుర్కియే, సిరియాల్లో భూకంప మరణాలు అంతకంతకూ పెరుగుతూ వస్తున్నాయి. దక్షిణ తుర్కియేలో రెండు రోజుల తర్వాత శిథిలాల కింద సజీవంగా ఉన్న ఓ పసికందును సహాయక సిబ్బంది కాపాడారు.

source:Eenadu

దర్శకుడు దశరథ్‌ తాను రాసిన ‘కథారచన’ పుస్తకాన్ని ప్రముఖ సినీనటుడు పవన్‌కల్యాణ్‌కు కానుకగా అందజేశారు.

source:Eenadu

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ‘యువగళం’ పాదయాత్రలో భాగంగా చిత్తూరు జిల్లాలోని సంసిరెడ్డిపల్లెలో పర్యటించారు. ఆయన ఆత్మకూరులోని ముత్యాలమ్మ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.

source:Eenadu

ప్రముఖ నటుడు మహేశ్‌బాబు, నమ్రత దంపతులు హైదరాబాద్‌లోని విమానాశ్రయంలో కనిపించి సందడి చేశారు.

source:Eenadu

తెలుగు క్రికెటర్ శ్రీకర్ భరత్‌ టెస్టు జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. టీమ్‌ఇండియా తరఫున ఆసీస్‌తో బోర్డర్‌ - గావస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో స్థానం దక్కింది. మ్యాచ్‌ మొదలుపెట్టే ముందు ఆయన తన తల్లిని ఆలింగనం చేసుకున్నారు.

source:Eenadu

హీరో ధనుష్‌, సంయుక్తా జంటగా వెంకీ అట్లూరి తెరకెక్కించిన చిత్రం ‘సార్‌’ . సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ట్రైలర్‌ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌ నంబర్‌వన్‌గా నిలిచింది. 

source:Eenadu

రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ ఆలయంలో ఇస్రో అధిపతి డా. సోమనాథ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

source:Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు(21-07-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(21-07-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(20-07-2025)

Eenadu.net Home