చిత్రం చెప్పే విశేషాలు..!
(11-02-2023/2)
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని సాగుతున్న యువగళం పాదయాత్రలో భాగంగా లోకేష్ ఓ వృద్ధురాలిని ఎలా ఉన్నావంటూ ఆప్యాయంగా పలకరించారు.
source:Eenadu
మాజీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ ఫార్ములా ఈ రేసింగ్ చూసేందుకు హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా పినిన్‌ఫర్నియా బటిస్టా ఈవీ కారులో ఆయన ప్రయాణించారు.
source:Eenadu
చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘భోళా శంకర్’. ఈ సినిమా సెట్స్‌ను ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు సందర్శించారు. చిరంజీవి, కీర్తి సురేష్, మెహర్ రమేశ్ తదితర చిత్రబృందంతో ముచ్చటించారు.
source:Eenadu
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఏలూరు జిల్లాలోని భీమవరంలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని దర్శించుకొని నివాళి అర్పించారు.
source:Eenadu
శ్రీనివాస మంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శనివారం ధ్వజారోహణ ఘట్టంతో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
source:Eenadu
శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ పదవికి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ తన నామినేషన్ పత్రాలను మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుల సమక్షంలో మండలి కార్యదర్శి నరసింహకు అందించారు.
source:Eenadu
హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ సమీపంలో ఫార్ములా ఈ రేస్ సందడిగా సాగుతోంది. ఈ సందర్భంగా క్రికెటర్ యజువేంద్ర చాహల్ రేస్‌ను వీక్షించి అభిమానులతో సెల్ఫీ దిగారు.
source:Eenadu
మోహన్‌బాబు, మంచు లక్ష్మీ ప్రసన్న ప్రధాన పాత్రల్లో ప్రతీక్ ప్రజోష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అగ్నినక్షత్రం’. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను ఫిబ్రవరి 14న హీరో రానా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.
source:Eenadu