చిత్రం చెప్పే విశేషాలు..!
(25-02-2023/2)
ఎమ్మెల్సీ కవిత శనివారం ముంబయి పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి భారాస నేతలతో కలిసి ఆమె ఛత్రపతి శివాజీ విగ్రహానికి నివాళి అర్పించారు.
source:eenadu
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఆసియా జువెల్ షో నిర్వహించారు. కార్యక్రమంలో మిస్ ఇండియా 2022 రన్నరప్ రూబెల్ షెకావత్, మోడల్స్ పాల్గొన్నారు.
source:eenadu
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర తిరుపతి నియోజకవర్గంలో కొనసాగుతోంది. నారా లోకేశ్ భవన నిర్మాణ కార్మికులతో ముఖాముఖి నిర్వహించారు.
source:eenadu
రాయ్‌పుర్‌లో నిర్వహిస్తున్న కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశాలకు హాజరైన ప్రియాంక గాంధీకి కార్యకర్తలు పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు. ప్లీనరీ సమావేశాల్లో అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తదితరులు పాల్గొన్నారు.
source:eenadu
రితికా సింగ్ ప్రధాన పాత్రలో హర్షవర్ధన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఇన్ కార్’. మార్చి 3న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో రితికా సింగ్ ఇలా మెరిశారు.
source:eenadu
కాలిఫోర్నియా వేదికగా ‘హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్’ అవార్డుల ప్రదానోత్సవం కోలాహలంగా నిర్వహించారు. ఈ వేడుకలో అమెరికా అందాల తార, నటి మ్యాడెలిన్ క్లిన్ ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.
source:eenadu
హైదరాబాద్‌లోని నల్సార్ లా యూనివర్సిటీలో 19వ వార్షిక సమావేశం నిర్వహించారు. ఇందులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పాల్గొని ప్రసంగించారు.
source:eenadu
ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేపట్టిన వాడ వాడ పువ్వాడ కార్యక్రమం కొనసాగుతోంది. ఆయన దుస్తులు ఇస్త్రీ చేసి సింప్లిసిటీని చాటుకున్నారు.
source:eenadu