చిత్రం చెప్పే విశేషాలు..!(14-03-2023/2)
ఖమ్మం నగరంలో పచ్చదనం అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది సర్దార్ పటేల్ స్టేడియం. ఇక్కడ విస్తరించిన పచ్చదనం ఆహ్లాదం పంచుతోంది. వేసవి రాగానే ఎండిపోయిన ఆకులు రాలడంతో భారీగా చెత్త పోగవుతోంది.
source:eenadu
పేద కుటుంబాలకు చెందిన వారంతా వీరిలా ఆలోచన చేస్తే, తక్కువ ఖర్చుతో మంచి ఇళ్లు కట్టుకోవచ్చని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చిన్నమట్టపల్లి సర్పంచి పిట్టా రామారావు అన్నారు.
source:eenadu
పైపుల మరమ్మతులతో 4 రోజులుగా తాగునీరు లేక హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి డివిజన్ పాపిరెడ్డినగర్‌లో దేవాలయం వద్ద ఉన్న వాటర్ ప్లాంట్‌కు డబ్బాలతో వచ్చి పట్టుకెళ్తున్నారు.
source:eenadu
రంగారెడ్డి జిల్లా చెవేళ్ల మండలం ఎన్కేపల్లిలో కోళ్ల ఫారంపై పెంచిన తీగల మొక్కలివి. ఎండ తీవ్రతకి కోళ్లు చనిపోకుండా ఫారం కప్పుపై తీగజాతి మొక్కలను పాకించడంతో 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుందని చెబుతున్నారు
source:eenadu
ఇప్పటికే హైదరాబాద్ నగరవాసులు వీధి శునకాలతో బెంబేలెత్తుతుండగా ఇప్పుడు వాటికి కోతులు తోడయ్యాయి. దోమల్‌గూడ రోడ్డు గగన్‌మహల్ కాలనీలో నిత్యం గుంపుగా వచ్చి జనాలను భయపెట్టిస్తున్నాయి.
source:eenadu
హైదరాబాద్ కూకట్‌పల్లిలోని ఇమ్మడి సిల్వర్ షోరూంను సినీ నటి రీతు వర్మ ప్రారంభించారు. ఆభరణాలు ధరించి ఫొటోలకు పోజులిచ్చారు.
source:eenadu
నటుడు సాయి ధరమ్ తేజ్ తాను హీరోగా ప్రధాన పాత్రలో తెరకెక్కిన విరూపాక్ష సినిమా గురించి ఆసక్తిగల ఫొటోను ట్విటర్ వేదికగా పోస్టు చేశారు. ‘అక్షరాల వెనకున్న అంకెలు, ఆ అంకెలే కథకు ఆరంభం.. ఈ పజిల్‌ను డీకోడ్ చేయండి’ అంటూ నెటిజన్లకు ప్రశ్న సంధించారు.
source:eenadu
జన సైనికుల ప్రకటనల మధ్య బందరులో మంగళవారం జరగనున్న జనసేన పదో వార్షిక ఆవిర్భావ సభకు సిద్ధమైన వారాహి వాహనం..
source:eenadu