చిత్రం చెప్పే విశేషాలు..!
(25-03-2023/2)
చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరీ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘మేమ్ ఫేమస్’. ఈ సినిమా టీజర్‌ను మార్చి 26న ఏఎంబీ సినిమాస్‌లో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.
source:eenadu
కర్ణాటకలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ.. అక్కడి చిక్కబల్లాపూర్‌లోని ప్రముఖ ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య స్మారకం వద్ద నివాళి అర్పించారు. source:eenadu
విశాఖపట్నంలో ఈ నెలాఖరున జరగనున్న జీ20 సదస్సు కోసం నగరంలోని పలు ప్రాంతాలను ముస్తాబు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్కే బీచ్ నుంచి రుషికొండ తీరమార్గంలోని రహదారిని, తెన్నేటి పార్కును అందంగా తీర్చిదిద్దుతున్నారు.
source:eenadu
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో పోలీసు సబ్సీడి క్యాంటీన్ ‘అంగడి’ని తెలంగాణ హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జితేందర్, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ప్రారంభించారు.
source:eenadu
కిరణ్ అబ్బవరం ప్రముఖ నటుడు రామ్‌చరణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఆయన ట్విటర్ ఖాతాలో పంచుకున్నారు. ‘అన్నా.. చరణ్ అన్నా.. మోస్ట్ లవెబుల్ పర్సన్’ అని కిరణ్ అబ్బవరం పోస్టు పెట్టారు.
source:eenadu
నితిన్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇష్క్’. నిత్యామీనన్ కథానాయిక. 2012లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. మార్చి29 నితిన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను రీరిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.
source:eenadu
బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శనివారం వారాంతం కావడంతో భక్తులు పెద్దఎత్తున వచ్చారు.
source:eenadu
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పుర్‌లో సీఆర్పీఎఫ్ డే వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సుక్మాలోని పొటక్‌పల్లిలో పాఠశాలను సందర్శించి విద్యార్థులకు పాఠాలు బోధించారు.
source:eenadu
ఎన్టీఆర్, రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా విడుదలై నేటికి ఏడాది అవుతోంది. ఏడాది కాలంలో ఈ సినిమా వివిధ జాతీయ, అంతర్జాతీయ అవార్డులతో అందుకుంది.
source:eenadu