చిత్రం చెప్పే విశేషాలు..!
(08-04-2023/2)
ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో నటుడు నరేశ్, పవిత్రా లోకేశ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘మళ్ళీ పెళ్లి’ ఈ సినిమా టీజర్‌ను ఏప్రిల్ 13న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది.
source:eenadu
సికింద్రాబాద్ - తిరుపతి మధ్య నడవనున్న సెమీ హైస్పీడ్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. ప్రధానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్వాగతం పలికారు.
source:eenadu
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈశాన్య రాష్ట్రం అస్సాంలో పర్యటిస్తున్నారు. ఆమె తొలిసారిగా సుఖోయ్-30 MKI (Sukhoi-30) యుద్ధ విమానంలో ప్రయాణించారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోలను ఆమె ట్విటర్ వేదికగా పోస్టు చేశారు.
source:eenadu
నటి నిత్యా మీనన్ పుట్టిన రోజు సందర్భంగా నెటిజన్లు ఆమెకు ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ‘ ప్రతిభగల, అందమైన నటికి బర్త్ డే శుభాకాంక్షలు’ అని ఆమె చిరునవ్వులు చిందిస్తున్న ఓ ఫొటోను ట్వీట్ చేశారు.
source:eenadu
నటి రాశి ఖన్నా తన తాజా ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. పింక్ రంగు దుస్తుల్లో మెరిసిన ఈ ఫొటోలకు అభిమానులు ఖుషీ అవుతున్నారు.
source:eenadu
కేంద్ర హోం మంత్రి అమిత్ షాను మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి.. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి అమిత్ షాకు శాలువా కప్పి కృతజ్ఞతలు తెలిపారు.
source:eenadu
సికింద్రాబాద్- తిరుపతి మధ్య వందేభారత్ రైలును ప్రారంభించిన అనంతరం పరేడ్ గ్రౌండ్స్‌లో మోదీని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కళాకారుల నృత్య ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది.
source:eenadu
ప్రధాని నరేంద్ర మోదీ చెన్నైకి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్, గవర్నర్ ఆర్‌ఎన్ రవి ఆయనకు ఘనస్వాగతం పలికారు.
source:eenadu
హైదరాబాద్‌లో ‘స్వాతంత్రోద్యమం- తెలుగు సినిమా ప్రముఖులు’ పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సినీ ప్రముఖులకు శాలువా కప్పి సన్మానించారు.
source:eenadu