చిత్రం చెప్పే విశేషాలు..!

(26-01-2023/2)

కల్యాణ్‌రామ్‌ హీరోగా రాజేంద్రరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘అమిగోస్‌’. అశికా రంగనాథ్‌ కథానాయిక. ఈ సినిమాలోని ‘ఎన్నో రాత్రులొస్తాయి’ పాటను ఈ నెల 29న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది.

source:EENADU

దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసి వెలుగులోకి రాని వీరులకు అంకితమిస్తూ ‘సత్య’ అనే వీడియో పాటను త్వరలో విడుదల చేస్తున్నట్లు దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ ప్రకటించింది. ఇందులో సాయిధరమ్‌ తేజ్‌, స్వాతి నటించనున్నారు. 

source:EENADU

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా హైదరాబాద్‌ సైక్లింగ్‌ గ్రూప్ ఆధ్వర్యంలో దుర్గం చెరువు తీగల వంతెన నుంచి సైకిల్ రైడ్‌ నిర్వహించారు.

source:EENADU

సినీనటుడు రవితేజ జన్మదినం సందర్భంగా ప్రముఖ నటుడు చిరంజీవి ఆయనకు ట్విటర్‌ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 

source:EENADU

నాని హీరోగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘దసరా’. కీర్తి సురేష్‌ కథానాయిక. చిత్ర టీజర్‌ను ఈ నెల 30న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.

source:EENADU

భారత క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్యా.. మహేంద్ర సింగ్‌ ధోనీతో కలిసి ద్విచక్రవాహనంపై దిగిన ఫొటోను తన ట్విటర్‌లో ఖాతాలో పంచుకున్నారు. ‘షోలే 2’ త్వరలో రాబోతోందని పాండ్యా ఫన్నీగా పోస్టు పెట్టారు.

source:EENADU

వెంకటేశ్‌ హీరోగా శైలేష్‌ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా‘సైంధవ్‌’. ఈ సినిమా చిత్రీకరణ గురువారం పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. కార్యక్రమంలో సినీనటుడు రానా పాల్గొన్నారు.

source:EENADU

సికింద్రాబాద్ ఆర్‌ఆర్‌సీ గ్రౌండ్‌లో రైల్వే శాఖ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చేసిన విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి.

source:EENADU

బాసరలో వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. 

source:EENADU

తిరుమల శ్రీవారిని ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ దర్శించుకున్నారు. తనకు కాబోయే భార్య రాధికా మర్చంట్‌తో కలిసి ఆయన స్వామివారి అర్చన సేవలో పాల్గొన్నారు.

source:EENADU

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

source:EENADU

మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌, నాదెండ్ల మనోహర్‌.

source:EENADU

రాజ్‌భవన్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ తమిళిసై జాతీయ జెండాను ఆవిష్కరించారు.

source:EENADU

చిత్రం చెప్పేవిశేషాలు(21-07-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(21-07-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(20-07-2025)

Eenadu.net Home