చిత్రం చెప్పే విశేషాలు..!

(24-01-2023/1)

పులి చారలతో ఓ శునకం ఉండటం చూపరులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.. భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం బూర్గుగూడెంలో ఓ వ్యక్తి తన శునకానికి రంగులు వేశారు. ఒక్కసారిగా చూడగానే భయమేసేలా ఉంది.

source:EENADU

దిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రదర్శించడానికి కర్ణాటక శకటానికి అనుమతి లభించిందని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ప్రకటించారు. ఈసారి రాష్ట్రం తరఫున ‘నారీశక్తి’ శకటాన్ని తీర్చిదిద్దినట్లు తెలిపారు.



source:EENADU

విజయవాడ పున్నమిఘాట్లో యువగళం పాదయాత్ర విజయవంతం కావాలని నారాలోకేష్‌ పుట్టినరోజు సందర్భంగా తెదేపా నాయకులు సుమారు 1000కేజీల కేకును కోశారు. 

source:EENADU

యాదాద్రి పంచనారసింహుల దివ్యాలయ గోపురాలపై సోమవారం నెలవంక దర్శనమిచ్చింది. ఇష్టదేవుడి ఆలయ గోపురం, దివ్య విమానంపై అపూర్వ దృశ్యం భక్తులను ఎంతో ఆకట్టుకుంది.

source:EENADU

సాధారణంగా రైలు పట్టాలపై రైలింజన్‌ను చూస్తుంటాం. సోమవారం కర్నూలు వైపు నుంచి హైదరాబాదుకు లారీపై రైలింజన్‌ను తరలిస్తున్నారు. దీన్ని వాహనదారులు ఆసక్తిగా తిలకించారు.

source:EENADU

హైదరాబాద్‌ నగరంలో సందర్శించే పర్యాటక ప్రాంతాల జాబితాలో చార్మినార్, గోల్కొండకు తోడుగా కొత్తగా మాదాపూర్‌ చేరింది. ఇటీవల నగర పర్యాటకుల ప్రయాణాలను పరిశీలిస్తే ఈ విషయం వెల్లడైందని అమెరికాకు చెందిన ఎయిర్‌బీఎన్‌బీ చెప్పింది.

source:EENADU

గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని హైదరాబాద్, ట్యాంక్‌బండ్‌ వద్ద ఉన్న జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం రాత్రి విద్యుత్తు వెలుగుల్లో తళుకులీనుతోంది. source:EENADU

హైదరాబాద్, ఎల్బీనగర్‌ కూడలిలో మరో పైవంతెన త్వరలో అందుబాటులోకి రానుంది. హయత్‌నగర్‌ నుంచి దిల్‌సుఖ్‌నగర్‌ వైపు వెళ్లే ఫ్లైఓవర్‌ పనులు పూర్తయ్యాయి. సోమవారం రాత్రి పైవంతెనపై వీధిదీపాలు వేయడంతో రహదారి వెలిగిపోతోంది.

source:EENADU

 ప్రజలు రోడ్లపై మల, మూత్ర విసర్జన చేయవద్దని అధికారులు ఫ్రీ టాయిలెట్స్‌ ఏర్పాటు చేశారు. వాటి నిర్వహణ పట్టించుకోకపోవడంతో హైదరాబాద్, గోషామహల్‌ చాక్నావాడీలో అధ్వాన పరిస్థితులు నెలకొన్నాయి. 

source:EENADU

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మల్లికార్జునస్వామి ఆలయంలో సోమవారం పట్నం వారం, అగ్నిగుండాల కార్యక్రమాలు వైభవోపేతంగా జరిగాయి. 

source:EENADU

ఉత్తర్‌ప్రదేశ్‌లో బంగారంతో పతంగి తయారు చేశారు. చరఖా, దారాన్ని కూడా బంగారంతోనే రూపొందించారు. అభరణాలకు ప్రసిద్ధిగాంచిన మేరఠ్‌ నగరంలో దీని రూపకల్పన జరిగింది.

source:EENADU

చిత్రం చెప్పేవిశేషాలు(20-07-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(20-07-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(19-07-2025)

Eenadu.net Home