చిత్రం చెప్పే విశేషాలు..!
(01-01-2023/1)
ఏలూరులోని డీఎంహెచ్‌వో కార్యాలయం వెనకున్న పట్టణ ఆరోగ్యకేంద్రానికి, ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో రూ.1.49 కోట్లతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికీ వైకాపా జెండా తరహా రంగులే వేయించారు.
source : eenadu
రూ.3.5 కోట్లు పెట్టి 6.25 కి.మీ. మేర జాతీయ రహదారికి మరమ్మతు చేస్తే... పది రోజులకే ఆ రోడ్డు మళ్లీ పగుళ్లిచ్చింది. అమరావతి-అనంతపురం జాతీయ రహదారి బాపట్ల జిల్లా సంతమాగులూరు-పుట్టావారిపాలెం మధ్య చేసిన మరమ్మతులు చేసినా రోడ్డు అస్తవ్యస్తంగా మారింది
ssource : eenadu
కోవూరు సమీపంలోని నెల్లూరు బ్యారేజీలో శనివారం సాయం సంధ్యవేళలో సూర్యుడి ప్రతిబింబం నీటిలో బంగారు రంగులో కాంతులీనింది. ఇక్కడ ఎంతో ఆహ్లాదకరంగా ఉండటంతో సూర్యకాంతిని చూస్తూ ప్రజలు మైమరచిపోయారు.
source : eenadu
ఆంగ్ల నూతన సంవత్సరంలోశ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు పంచాయతి యాచవరానికి చెందిన సూక్ష్మ కళాకారుడు ఆలూరు రాము ఆచారి అగ్గిపెట్టెలో పట్టే క్యాలెండర్‌ను రూపొందించారు. 6 సెం.మీ. పొడవు, 4 సెం.మీ. వెడల్పుతో దీనిని తీర్చిదిద్దినట్లు ఆయన వివరించారు.
source : eenadu
రష్యా క్షిపణి దాడి కారణంగా ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ధ్వంసమైన హోటల్ భవనం. source : eenadu
కరోనా వేరియంట్ల భయాందోళనలను పక్కన పెట్టి ప్రపంచమంతా నూతన సంవత్సరానికి ఘనంగా ఆహ్వానం పలికింది. ఈ ఏడాది పసిఫిక్ మహా సముద్రంలోని కిరిబాటి దీవుల్లో ముందుగా 2023 ఉత్సవాలు మొదలయ్యాయి. బాణాసంచా వెలుగుల్లో నూతన శోభ సంతరించుకున్న ఆస్ట్రేలియాలోని సిడ్నీ హార్బర్.
source : eenadu
జపాన్ రాజధాని టోక్యో సమీపంలోని నురుయోకాలో కొండచరియలు విరిగిపడటంతో ధ్వంసమైన భవనాలు.
source : eenadu
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేటప్పుడు ఇచ్చే పూల బోకేలో ఓరియంటల్ లిల్లీలు ఆకట్టుకుంటున్నాయి. నీడలో ఉంచి నీళ్లు చిలకరిస్తుంటే 14 రోజులు సువాసన వెదజల్లుతుందని నిర్వాహకులు తెలిపారు.
source : eenadu