పింక్‌ ‘పవర్‌’ రన్‌

మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబాలు, ఆ తర్వాత దేశం ఆరోగ్యంగా ఉంటుందని సెప్టెంబరు 29న హైదరాబాద్‌ గచ్చిబౌలి స్టేడియంలో పింక్‌ పవర్‌ రన్‌ చేపట్టారు.

మహిళలను అధికంగా వేధిస్తున్న సమస్య రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించడమే పింక్‌ పవర్‌ రన్‌ లక్ష్యం. 

అక్టోబరు 25న బ్రెస్ట్‌ క్యాన్సర్‌ డే. అందుకే అక్టోబరు నెల మొత్తాన్ని బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ఎవేర్‌నెస్‌ మంత్‌గా వ్యవహరిస్తారు.

మేఘా ఇంజినీరింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌, సుధా రెడ్డి ఫౌండేషన్‌ ఈ కార్యక్రమం నిర్వహించింది. వేలాది మంది ఐటీ విద్యార్థులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

మహిళలు పూర్తి ఆరోగ్యంగా ఉండాలి. రొమ్ము క్యాన్సర్‌ని అరికట్టాలి. వారు అరోగ్యంగా ఉంటేనే దేశం ప్రగతి పథంలో నడుస్తుంది అని పింక్‌ రన్‌లో పాల్గొన్న వారిలో ఉత్సాహాన్ని నింపారు తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి.

రన్‌ను కేటగిరీల కింద విభజించి 3, 5, 10 కి.మీ చొప్పున నిర్వహించారు. ఇందులో గెలిచిన వారికి బహుమతులు అందించి ప్రోత్సహించారు రేవంత్‌.

10 కి.మీ రేస్‌లో గెలిచిన మొదటి వ్యక్తికి రూ. 2,50,000 లక్షలు, మొదటి రన్నరప్‌కి రూ. 1,75,000 వేలు, రెండో రన్నరప్‌కి రూ. 1,00,000 బహుమతిగా అందజేశారు.  

క్యాన్సర్‌ నుంచి కోలుకున్న అనేక మంది మహిళలు ఈ మారథాన్‌లో పాల్గొని వారి స్ఫూర్తి కథనాలను మిగతా వారితో పంచుకున్నారు.

 మారథాన్‌ ముగిసిన తర్వాత కూల్‌ డౌన్‌ సెషన్లు, సరదాగా ఆటలు ఆడించడం, మ్యూజిక్‌తో రిలాక్స్‌ అవ్వడం వంటి కార్యక్రమాలు చేపట్టారు.

చిత్రం చెప్పేవిశేషాలు(13-12-2024)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు(12-12-2024)

Eenadu.net Home