విదేశాల్లో స్థిరపడాలంటే.. ఈ ప్రణాళిక అవసరం!
కొంతమంది స్వదేశాన్ని వదిలి.. విదేశాల్లో స్థిరపడాలని భావిస్తుంటారు. అదేమంత సులభం కాదు. ఇందుకోసం ఏడాది ముందు నుంచే పక్కా ప్రణాళిక వేసుకోవాలి. అదెలాగంటే..
Image: Pixabay
మీ విద్యార్హతలను బట్టి స్వదేశం నుంచే విదేశాల్లో ఉద్యోగం వెతుక్కోవాలి. మీకు నచ్చిన ప్రాంతంలో.. మీకు తగిన ఉద్యోగం లభిస్తే వెళ్లడానికి సిద్ధపడొచ్చు.
Image: Pixabay
ఒకవేళ విదేశానికి వెళ్లిన తర్వాత ఉద్యోగం వెతుక్కోవాలి అనుకుంటే.. కనీసం 6 నెలల ఖర్చుకు సరిపడా డబ్బులు దగ్గర పెట్టుకోవాలి.
Image: Pixabay
మీరు వెళ్లే ప్రాంతంలో మౌలిక సదుపాయాలు, కాస్ట్ ఆఫ్ లివింగ్‌పై అవగాహన ఉండాలి. ఇందుకోసం నమ్మదగిన బ్లాగ్స్, ఫోరమ్స్ చదవాలి.
Image: Pixabay
మీరు ఆరోగ్యంగా ఉన్నారో లేదో పరీక్షలు చేయించుకొని మెడికల్ సర్టిఫికెట్ తీసుకోవాలి. దీనివల్ల భవిష్యత్తులో ఇన్సూరెన్స్ ఇబ్బందులు తలెత్తవు.
Image: Pixabay
ప్రస్తుతం స్వదేశంలో మీకున్న స్థిరచరాస్తులను విక్రయించి నగదు రూపంలోకి మార్చుకోవాలి. ఆ మొత్తాన్ని ఒకే అకౌంట్లో కాకుండా రెండు అకౌంట్లలో జమ చేసుకోవడం ఉత్తమం.
Image: Pixabay
బ్యాంకు అధికారులతో మాట్లాడి విదేశాల్లోనూ పనిచేసేవిధంగా డెబిట్/క్రెడిట్ కార్డు తీసుకోవాలి.
Image: Pixabay
ఇక్కడి కాంట్రాక్ట్స్, ఇన్సూరెన్స్, ఇంటర్నెట్ కనెక్షన్, ఇతర సబ్‌స్క్రిప్షన్స్‌ను సంబంధిత అధికారులతో మాట్లాడి క్లోజ్ చేయాలి.
Image: Pixabay
ఏయే వస్తువుల్ని తీసుకెళ్లాలో ఓ జాబితా రూపొందించుకొని దాని ప్రకారం లగేజ్ సర్దుకోవాలి. అనవసరమైన వాటితో లగేజ్ బరువు పెంచితే.. ఎయిర్‌పోర్టులో అదనపు ఛార్జ్ వసూలు చేస్తారు.
Image: Pixabay
ఇంట్లో ఫర్నిచర్‌ను వీలైనంత వరకు ఇక్కడే విక్రయించడం మంచిది. తీసుకెళ్లాలనుకుంటే దానికి పెద్దమొత్తంలోనే డబ్బు ఖర్చు అవుతుంది.
Image: Pixabay
మీకు సంబంధించిన ముఖ్యమైన పత్రాలను ఒక చోట భద్రపర్చండి. అలాగే.. వాటిని డిజిటల్ రూపంలోకి మార్చుకొని స్టోర్ చేయడం మర్చిపోవద్దు.
Image: Pixabay
ఫ్లైట్ టికెట్స్ ఎంత ముందుగా బుక్ చేసుకుంటే ధర అంత తక్కువగా ఉంటుంది. కాబట్టి.. ముందుగానే టికెట్స్ బుక్ చేసుకోండి.
Image: Pixabay
విదేశంలో ఒక ఏడాది కాలానికి ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచిది. ఏదైనా జరిగితే ఆర్థిక భారం మీదపడకుండా ఉంటుంది.
Image: Pixabay
మీరు బయలుదేరే ముందు మీ బంధువులకు, బ్యాంక్‌కు, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి.
Image: Pixabay