6 బంతుల్లో 6 సిక్స్‌లు బాదింది వీరే

ప్రొఫెషనల్‌ క్రికెట్‌లో మొట్టమొదటిసారి 6 బంతుల్లో 6 సిక్స్‌లు బాదిన రికార్డు వెస్టిండీస్‌ క్రికెట్ దిగ్గజం సర్ గ్యారీ సోబర్స్ పేరిట ఉంది. 1968లో నిర్వహించిన ఇంగ్లాండ్‌ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో నాటింగ్‌హామ్‌షైర్‌కు ఆడిన ఆయన గ్లామోర్గాన్ జట్టుపై ఈ ఘనత అందుకున్నాడు.

Image:Twitter

6 బంతుల్లో 6 సిక్స్‌లు బాదిన మొదటి భారత క్రికెటర్‌ రవిశాస్త్రి. 1985 రంజీ ట్రోఫీలో బాంబే జట్టుకు ఆడిన శాస్త్రి బరోడా జట్టుపై ఈ ఫీట్‌ సాధించాడు.

Image:Twitter

2007 వన్డే ప్రపంచకప్‌లో సౌతాఫ్రికా ప్లేయర్‌ హెర్షెల్‌ గిబ్స్‌ నెదర్లాండ్స్‌పై ఒకే ఓవర్‌లో 6 సిక్స్‌లు బాదాడు.

Image:Twitter

2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌పై యువరాజ్‌ సింగ్‌ 6 బంతుల్లో 6 సిక్స్‌లు బాదాడు. ఈ ఇన్సింగ్స్‌ భారత క్రికెట్ అభిమానుల కళ్ల ముందు ఇప్పటికీ కదలాడుతుంది.

Image:Twitter

టీ20 బ్లాస్ట్ 2017 టోర్నీలో వోర్సెస్టర్‌షైర్ రాపిడ్ జట్టుకు చెందిన రాస్ వైట్లీ అనే ఆటగాడు యార్క్‌షైర్ వైకింగ్స్‌ జట్టుపై ఒకే ఓవర్లో 6 సిక్స్‌లు కొట్టాడు. టీ20 బ్లాస్ట్‌ని ఇంగ్లాండ్‌లో నిర్వహిస్తారు.

Image:Twitter

అఫ్గానిస్థాన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (2018 )లో కాబుల్ జ్వానన్ టీమ్‌ ఆటగాడు హజ్రతుల్లా జజాయ్.. బాల్ఖ్ లెజెండ్స్‌పై 6 బంతుల్లో 6 సిక్స్‌లు బాదాడు.

Image:Twitter

2020లో జరిగిన సూపర్‌ స్మాష్‌ టోర్నీలో  కాంటర్‌బరీ కింగ్స్‌ ఆటగాడు లియో కార్టర్.. నార్తర్న్‌ నైట్స్‌ జట్టుపై ఒకే ఓవర్‌లో ఆరు సిక్స్‌లు కొట్టాడు.

Image:Twitter

2021లో జరిగిన ఓ టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్‌ ఆటగాడు కీరన్‌ పొలార్డ్‌ శ్రీలంకపై 6 బంతుల్లో 6 సిక్స్‌లు బాదాడు.

Image:Twitter

మేజర్‌ క్లబ్స్‌ లిమిటెడ్ ఓవర్‌ లిస్ట్‌ ఏ టోర్నీ (2021, శ్రీలంక)లోని ఓ మ్యాచ్‌లో తిసార పెరీరా ఓకే ఓవర్లో 6 సిక్స్‌లు కొట్టాడు.

Image:Twitter

2021లో పాపువా న్యూగినియా, అమెరికా మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత సంతతికి చెందిన అమెరికా ఆటగాడు జస్కరన్ మల్హోత్రా 6 బంతుల్లో 6 సిక్స్‌లు బాదాడు.

Image:Twitter

తాజాగా ఈ జాబితాలో వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్‌ చోటు దక్కించుకున్నాడు. క్రికెట్ వెస్టిండీస్ (CWI) కొత్తగా ప్రవేశపెట్టిన ‘సిక్స్‌టీ’ టోర్నీలో రసెల్‌ వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు బాదాడు.

Image:Twitter

IND vs BAN.. ఎప్పుడు, ఎక్కడ, ఎందులో?

సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాతో భారత్‌ టెస్ట్‌ సిరీస్‌!

దులీప్‌ ట్రోఫీ.. బౌలింగ్‌తో దుమ్ముదులిపేశారు!

Eenadu.net Home