ఐపీఎల్‌ 2024... మిస్‌ అవుతున్న ప్లేయర్లు వీళ్లే!

మరో పది రోజుల్లో ఐపీఎల్‌ 2024 ప్రారంభం కాబోతోంది. అయితే కొంతమంది ప్లేయర్లు వివిధ కారణాల వల్ల ఈ సీజన్‌కు పూర్తిగా / పాక్షికంగా దూరమవుతున్నారు. వాళ్లెవరో చూద్దాం!

లుంగి ఎంగిడి

జట్టు: దిల్లీ క్యాపిటల్స్‌

దక్షిణాఫ్రికాకు చెందిన పేసర్ గాయం కారణంగా ఈ సీజన్‌ మొత్తానికి దూరమైనట్లు దిల్లీ క్యాపిటల్స్‌ ప్రకటించింది. అతడి స్థానంలో జేక్ ఫ్రేజర్‌ను తీసుకుంది.

మహమ్మద్‌ షమీ 

జట్టు: గుజరాత్‌ టైటాన్స్‌

మోకాలు గాయం కారణంగా టీమ్‌ ఇండియా స్టార్‌ పేసర్‌ షమీకి ఇటీవల లండన్‌లో శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. 

మాథ్యూ వేడ్‌

జట్టు: గుజరాత్‌ టైటాన్స్‌

షెఫీల్డ్‌ షీల్డ్‌ టోర్నీ ఫైనల్‌లో ఆడాల్సి ఉండటంతో తొలి మ్యాచులకు ఆస్ట్రేలియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ అందుబాటులో ఉండడు. 

మార్క్‌ వుడ్‌

జట్టు: లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌

పని ఒత్తిడిని తగ్గించుకునే క్రమంలో ఐపీఎల్‌కు దూరమవుతున్నట్లు ఇంగ్లాండ్‌ పేసర్‌ మార్క్‌ వుడ్‌ ఇటీవల ప్రకటించాడు. 

ప్రసిద్ధ్‌ కృష్ణ

జట్టు: రాజస్థాన్‌ రాయల్స్‌

మోకాలు గాయం కారణంగా టీమ్‌ ఇండియా పేసర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణ టోర్నీకి దూరమవుతున్నాడు. రంజీల్లో ఆడుతూ ఇటీవల గాయపడ్డాడు. 

జేసన్‌ రాయ్‌

జట్టు: కోల్‌కతా నైట్‌రైడర్స్‌

వ్యక్తిగత కారణాల వల్ల టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు ఇంగ్లాండ్‌ ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ ఇటీవల ప్రకటించాడు. 

గస్‌ అట్కిన్సన్‌

జట్టు: కోల్‌కతా నైట్‌ రైడర్స్‌

పని ఒత్తిడిని తగ్గించుకునే క్రమంలో ఐపీఎల్‌ ఆడకూడదని నిర్ణయించినట్లు ఇంగ్లాండ్ ఫాస్ట్‌ బౌలర్‌ అట్కిన్సన్‌ చెప్పాడు.

డెవాన్‌ కాన్వే

జట్టు: చెన్నై సూపర్‌ కింగ్స్‌

వేలికి గాయం కావడంతో న్యూజిలాండ్‌ బ్యాటర్‌ డెవాన్‌ కాన్వేకు శస్త్రచికిత్స చేశారు. దీంతో టోర్నీకి పూర్తిగా అందుబాటులో ఉండడు.

మతీశా పతిరణ

జట్టు: చెన్నై సూపర్‌ కింగ్స్‌

ఎడమ కాలి తొడ కండరాలు పట్టేయడంతో రెండు వారాలపాటు మతీశాకి విశ్రాంతి. టోర్నీ తొలి రెండు మ్యాచ్‌లు ఆడకపోవచ్చు.

హ్యారీ బ్రూక్‌

జట్టు: దిల్లీ క్యాపిటల్స్‌

తన నాయనమ్మ చనిపోవడంతో ఈ సీజన్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ హారీ బ్రూక్‌ తెలిపాడు.

ఒలింపిక్స్‌ గురించి ఆసక్తికర విషయాలు

శ్రీలంక పర్యటనలో భారత్‌.. ఎప్పుడు ఏ మ్యాచ్‌ అంటే?

టెస్టు క్రికెట్‌లో ఇంగ్లాండ్ ప్రపంచ రికార్డు

Eenadu.net Home