ఈవీల సబ్సిడీకి కొత్త పథకం

దేశీయంగా ఈవీ రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం ‘పీఎమ్‌ ఇ-డ్రైవ్‌’ పథకాన్ని ఆవిష్కరించింది.

దేశంలో ఈవీల వినియోగం పెంచేందుకు, ఛార్జింగ్‌ వసతుల ఏర్పాటుకు, ఈవీల తయారీ వ్యవస్థ అభివృద్ధికి ఊతమిచ్చేలా ₹10,900 కోట్లతో దీన్ని తీసుకొచ్చింది.

ఎప్పటి వరకు?

2024 అక్టోబరు 1 నుంచి 2026 మర్చి 31 వరకు ఈ పథకం అందుబాటులో ఉంటుంది. ఈఎంపీఎస్‌-2024 స్థానంలో దీనిని తీసుకొచ్చారు.

టూవీలర్‌ సబ్సిడీ ఎంత? 

విద్యుత్‌ ద్విచక్ర వాహనాలకు వాటి బ్యాటరీ సామర్థ్యం ఆధారంగా సబ్సిడీ ఉంటుంది. ఒక kWhకు ₹5,000 సబ్సిడీ అందజేస్తారు. తొలి ఏడాది ఒక్కో వాహనంపై ₹10వేలు మించదు. రెండో ఏడాది kWhకు ₹2,500 చొప్పున గరిష్ఠంగా ₹5,000 మాత్రమే ఇస్తారు.

త్రిచక్ర వాహనాలకు?

త్రిచక్ర వాహనాలకు (ఇ-రిక్షాలు సహా) kWhకు ₹5 వేలు సబ్సిడీ లభిస్తుంది. తొలి ఏడాది ₹25 వేలు, రెండో ఏడాది ₹12,500 చొప్పున ప్రోత్సాహకాలు అందుతాయి. ఎల్‌ 5 విభాగానికి (రవాణా త్రిచక్ర వాహనాలకు) తొలి ఏడాది ₹50,000, రెండో ఏడాది ₹25,000 చొప్పున ఇస్తారు.

సబ్సిడీ ఎలా తీసుకోవాలి?

రాయితీ పొందేందుకు త్వరలో మొబైల్‌ యాప్‌ను ఆవిష్కరిస్తారు. కొనుగోలు చేసిన వెంటనే పోర్టల్‌లో ఆధార్‌ ఆధారిత ఇ-ఓచర్‌ జనరేట్‌ అవుతుంది. దానిపై సంతకం చేసి డీలరుకు అందిస్తే, ప్రోత్సాహకాలు పొందొచ్చు. ఒక ఆధార్‌ నంబర్‌పై ఒక వాహనాన్నే అనుమతిస్తారు.

ఎన్ని వాహనాలకు ప్రయోజనం?

ఈ పథకం కింద 24.79 లక్షల విద్యుత్‌ ద్విచక్ర, 3.16 లక్షల విద్యుత్‌ త్రిచక్ర, 14,028 ఇ- బస్‌లకు ప్రయోజనం లభించనుంది.

పన్నుప్రయోజనాలు అందించే పథకాలు ఇవే..

యూపీఐలో ఈ ఏడాది వచ్చిన మార్పులు

వాట్సప్‌ ఈ ఏడాది బెస్ట్‌ ఫీచర్లు ఇవీ..

Eenadu.net Home