‘పొలిమేర’ టు ‘లైలా’
‘మా ఊరి పొలిమేర 1, 2’ సినిమాలతో తెలుగులో క్రేజ్ సంపాదించుకుంది కామాక్షి భాస్కర్ల. ప్రస్తుతం ‘లైలా’తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ‘లైలా’లో విష్వక్‌సేన్ హీరో. ఇందులో నాయికగా ఆకాంక్ష శర్మ నటిస్తుండగా కీలక పాత్రను కామాక్షి పోషిస్తోంది.
‘ప్రియురాలు’తో 2022లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన కామాక్షి..‘రౌడీ బాయ్స్’, ‘కబూల్ హై’, ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’తో అదే ఏడాది అలరించింది.
‘విరూపాక్ష’, ‘ఓం భీమ్ బుష్’ చిత్రాలతో పాటు అఖిల్ నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’లో అతిథి పాత్రలో కనిపించింది.
సినిమాలే కాకుండా.. వెబ్‌సిరీసులతోనూ అలరిస్తోంది కామాక్షి. ‘ఝాన్సీ’, ‘సైతాన్’, ‘దూత’లో నటించింది.
హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన కామాక్షి.. చైనాలో ఎంబీబీఎస్ చదివింది. కొంత కాలం ఇంటర్న్‌గానూ పని చేసింది.
సంప్రదాయ సంగీతం, కూచిపూడి నాట్యంలో శిక్షణ తీసుకుంది. స్టేజీ ప్రదర్శనలు ఇవ్వడమంటే మహా ఇష్టం.
చిన్నప్పట్నుంచి నటి అవ్వాలనేది తన కోరిక. దర్శకత్వంపై కూడా ఆసక్తి ఉంది. ‘..పొలిమేర 2’కి డైలాగులు రాయడంతో పాటు అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ పని చేసింది.
అందాల పోటీల్లో పాల్గొనేందుకు దాదాపు 20 కేజీల బరువు తగ్గింది. తర్వాత 2018లో మిస్ తెలంగాణ కిరీటం అందుకుంది.
అదే ఏడాది కామాక్షి మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని.. ఫైనలిస్టుల జాబితాలో నిలిచింది.
పుస్తకాలు చదవడం, ట్రావెలింగ్ తన హాబీ. బోర్ కొడితే బైక్‌పై చక్కర్లు కొడుతుంటుంది.
ఎన్జీవోలతో కలసి పనిచేసి పేదవారికి అండగా ఉంటోంది. ఆర్థికంగా చేయూతనిస్తూ మంచి మనసు చాటుకుంటోంది.
ఈమె ఫిట్‌నెస్ ఫ్రీక్. నచ్చిన ఆహారం తింటూ.. దానికి తగ్గట్టు వ్యాయామం చేస్తూ ఫిట్‌నెస్‌లో తగ్గేదేలే అంటోంది.
సినిమాలతో బిజీగా ఉంటూనే సోషల్‌మీడియాలో సందడి చేస్తుంటుంది. తన గ్లామర్ ఫొటోలు పోస్టు చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.