హాలీడేలో పూజా హెగ్డే.. నెల మొత్తం విదేశాల్లోనే!

విదేశాల్లో పర్యటిస్తూ ఎంజాయ్‌ చేస్తోంది నటి పూజా హెగ్డే.

Image: Instagram/Pooja Hegde

ఈ ఏడాది ‘రాధే శ్యామ్‌’, ‘బీస్ట్‌’, ‘ఆచార్య’ చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించింది.

Image: Instagram/Pooja Hegde

‘ఎఫ్‌ 3’లో ‘లైఫ్‌ అంటే ఇట్టా ఉండాలా’ అంటూ సాగే ప్రత్యేక పాటలో వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌తో ఆడిపాడిందీ భామ..

Image: Instagram/Pooja Hegde

ఎంత పనిలో బిజీగా ఉన్నా కాస్తయిన విశ్రాంతి ఉండాలి కదా.. అందుకే సమయం చూసుకొని నెలపాటు విదేశాలకు టూర్‌ ప్లాన్‌ చేసింది.

Image: Instagram/Pooja Hegde

జులై నెల ప్రారంభంలోనే 3 ఖండాల్లో 4 నగరాలను పర్యటించేందుకు వెళ్తున్నట్లు సోషల్‌మీడియా ద్వారా తెలిపింది.

Image: Instagram/Pooja Hegde

మొదట ఆసియా ఖండంలోనే బ్యాంకాక్‌కు వెళ్లింది పూజా. అక్కడి బీచ్‌లో సేద తీరుతూ ప్రకృతిని ఆస్వాదించింది.

Image: Instagram/Pooja Hegde

ఆ తర్వాత యూరప్‌ ఖండంలోని ఇంగ్లాండ్‌లో వాలిపోయింది. అక్కడ ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ వద్ద ఫొటోకి పోజులిచ్చింది.

Image: Instagram/Pooja Hegde

ఇంగ్లాండ్‌లో ఉన్న మరో చారిత్రక కట్టడం స్టోన్‌హెంజ్‌ వద్ద కూడా సందడి చేసింది.

Image: Instagram/Pooja Hegde

లండన్‌ సహా ఇంగ్లాండ్‌లోని పలు ప్రాంతాలను సందర్శిస్తూ ఆ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేసింది.

Image: Instagram/Pooja Hegde

ఇప్పుడు యూఎస్‌ఏలో పర్యటిస్తోంది. భారత్‌కు తిరిగొచ్చాక మళ్లీ సినిమా షూటింగ్స్‌లో పాల్గొననుంది.

Image: Instagram/Pooja Hegde

ప్రస్తుతం పూజా.. ‘జనగణమన’, ‘సర్కస్‌’, ‘కభీ ఈద్‌ కభీ దివాళీ’ చిత్రాల్లో నటిస్తోంది.

Image: Instagram/Pooja Hegde

రిద్ది.. ప్రభాస్‌తో అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా!

కృతి సనన్.. గ్లామర్‌ అదిరెన్‌..!

బిహారీ భామ.. ఐశ్వర్యా సుస్మిత

Eenadu.net Home