అరవింద @ శ్రీలంక
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం విహారయాత్రలో ఎంజాయ్ చేస్తోంది.
Image: Instagram/Pooja Hegde
షూటింగ్స్‌కు బ్రేక్ ఇచ్చి తాజాగా శ్రీలంకకు వెళ్లింది పూజ. అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తోంది.
Image: Instagram/Pooja Hegde
శ్రీలంకలోని ఓ బీచ్‌లో చక్కర్లు కొడుతూ దిగిన ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దానికి ‘లవ్ యూ జిందగీ’ అని క్యాప్షన్ ఇచ్చింది.
Image: Instagram/Pooja Hegde
అంతకుముందు ఓ హోటల్‌లో వంటకాలు రుచి చూసింది. పీతలతో చేసిన వంటకం చాలా బాగుందని మరో పోస్టు పెట్టింది పూజ.
Image: Instagram/Pooja Hegde
సల్మాన్ ఖాన్‌తో కలిసి ఈమె నటించిన ‘కీసీ కా భాయ్.. కీసీ కీ జాన్’ ఇటీవల విడుదలైంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది.
Image: Instagram/Pooja Hegde
సినిమా ప్రమోషన్స్ పూర్తి కాగానే.. ‘ఫిల్మ్‌ఫేర్’ అవార్డు వేడుకలో సందడి చేసింది పూజ. సిల్వర్ రంగు డ్రెస్‌లో కనిపించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Image: Instagram/Pooja Hegde
ప్రస్తుతం ఈ బ్యూటీ మహేశ్‌బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న #SSMB28లో నటిస్తోంది.
Image: Instagram/Pooja Hegde
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు రామ్‌చరణ్‌తో కలిసి పూర్తిస్థాయిలో ఓ చిత్రం చేయాలని ఉందని చెప్పింది.
Image: Instagram/Pooja Hegde
ఇది వరకు ‘రంగస్థలం’లోని ‘జిగేలు రాణి’ పాటకు ఇద్దరూ కలిసి స్టెప్పులేశారు. ‘ఆచార్య’లో తక్కువ నిడివితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ‘కిసీ కా భాయ్..’లోని ఓ పాటలోనూ రామ్‌చరణ్ కనిపించాడు.
Image: Instagram/Pooja Hegde
త్వరలోనే రామ్‌చరణ్‌తో కలిసి నటించే అవకాశం వస్తుందని ఆశిస్తున్నట్లు వెల్లడించింది.
Image: Instagram/Pooja Hegde