డిజర్ట్‌ లేనిదే పూట గడవదు

టాలీవుడ్‌లో ‘ఆచార్య’ తర్వాత కనిపించని పూజా హెగ్డే.. హిందీలో వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతోంది.

రాఘవ లారెన్స్‌తో ‘కాంచన 4’లో నటిస్తోందని.. ప్రేక్షకులను భయపెట్టేందుకు సిద్ధమైందని వార్తలు వస్తున్నాయి.

 హిందీలో ‘దేవా’, ‘హే జవానీ తో ఇష్క్‌ హోనా హై’, తమిళ్‌లో సూర్య 44, విజయ్‌ 69లో నటిస్తోంది. 

2024 బాలీవుడ్‌ హంగామా స్టైల్ ఐకాన్‌ అవార్డ్స్‌లో.. ‘మోస్ట్‌ స్టైలిష్‌ వెర్సటైల్‌ టాలెంట్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ టైటిల్‌ను అందుకుంది.

అడవులు, కొండలు, గుట్టల్లోనే తన ఆనందాన్ని వెతుక్కుంటుంది పూజ. పురాతన కట్టడాలను సందర్శించడం ఇష్టం.

ఐస్‌క్రీమ్‌, పిజ్జాను ఇష్టంగా లాగించేస్తుంది. పైగా ‘డిజర్ట్‌లు డైట్‌ కౌంట్‌లోకి రావు. డిజర్ట్‌ లేనిదే పూట గడవదు’ అంటోంది

‘ఆహారమే సంతోషాన్ని ఇస్తుంది’ అంటూ.. ఇతర ప్రాంతాలకు వెళితే అక్కడ దొరికే స్పెషల్స్‌ని తప్పకుండా రుచి చూస్తుంది.

ఏం తిన్నా ఎంత తిన్నా ఫిట్‌నెస్‌ విషయంలో రాజీ పడదు పూజ. జిమ్‌లో కఠినమైన వ్యాయామాలు చేస్తుంది. 

ఖాళీ సమయం దొరికితే టెన్నిస్‌ ఆడుతుంది. సరదాగా సాయంత్రం వేళల్లో గ్రౌండ్‌లో చెమటోడుస్తుంది.  

‘సంవత్సరం మొత్తంలో నచ్చే పండుగ క్రిస్‌మస్‌. నేనే క్రిస్‌మస్‌ ట్రీని అలంకరించి.. స్నేహితులు, బంధువుల కోసం బహుమతులు సిద్ధం చేస్తా’ అని చెప్పింది.

బోర్‌ కొడితే పజిల్స్‌ పూరిస్తుంది పూజ. ఇది మెదడుకు కొత్త ఉత్సాహాన్ని అందిస్తుంది అని చెబుతోంది. 

టాప్‌ హీరోయిన్లు వీరే.. మార్పులు ఇవే!

గ్యాప్‌ తీసుకోలా.. వచ్చింది!

వైట్‌ శారీ.. క్యూటీస్‌!

Eenadu.net Home