పార్వతీ తిరువోతు.. అన్‌స్టాపబుల్‌

విక్రమ్‌ హీరోగా తెరకెక్కిన సినిమా ‘తంగలాన్‌’. ఈ చిత్రంతో పార్వతి తిరువోతు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో గంగమ్మ పాత్రలో కనిపించనుంది.

పా రంజిత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. ఇందులో మరో నాయిక మాళవిక మోహనన్‌.

మలయాళంలో తిరుగులేని నటిగా పేరు తెచ్చుకున్న పార్వతి 2006లో ‘ఔట్‌ ఆఫ్‌ సిలబస్‌’తో మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. 

తమిళ్‌, మలయాళం, కన్నడ భాషల్లో కలిపి దాదాపు 30 సినిమాలకు పైగా నటించింది. అంటే దక్షిణాది చిత్ర సీమలో తన క్రేజ్‌ అలాంటిది మరి..!

ప్రస్తుతం తమిళ్‌లో వస్తున్న ‘తంగలాన్‌’ కాకుండా.. మలయాళంలో మనోరతంగల్‌, హర్‌ చిత్రాల షూటింగ్‌లో బిజీగా ఉంది.

కెరీర్‌ మొదలు పెట్టినప్పటి నుంచీ ఏడాదికి కనీసం రెండు మూడు చిత్రాలతో అదే జోరును కొనసాగిస్తోందీ బ్యూటీ.

సినిమాలే కాకుండా వెబ్‌సిరీస్‌లతోనూ ఆకట్టుకుంటోంది. ప్రముఖ నటులందరూ ఉన్న ‘నవరస’లోనూ కనిపించింది. ఇటీవల నాగచైతన్య ‘దూత’లో పోలీస్‌ ఆఫీసర్‌గా కీలక పాత్రలో అలరించింది.  

తన అందం, అభినయంతో పార్వతి కేరళ స్టేట్‌ ఫిల్మ్‌ అవార్డు, ఉత్తమ నటిగా, పాపులర్‌ యాక్ట్రెస్‌గా ఫిల్మ్‌ఫేర్, సైమా వంటి ఎన్నో అవార్డులను కైవసం చేసుకుంది.  

‘వృత్తి ఏదైనా దాన్ని ప్రేమించాలి. ఒకవేళ నేను నటిని కాకపోయి ఉంటే టీ షాపు పెట్టాలనుకున్నా. మనం చేసే పనిని గౌరవించినప్పుడే జీవితంలో ఎదుగుతాం’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. 

సినిమా ప్రమోషన్లకు సంబంధించిన చిత్రాలనే ఇన్‌స్టాలో ఎక్కువగా పంచుకుంటూ ఉంటుంది. ఈమె ఇన్‌స్టా ఖాతాని 21 లక్షల మంది ఫాలో అవుతున్నారు.

ఈ కేరళ కుట్టికి చీరకట్టు అంటే ఎంతో ఇష్టం. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో శారీలో తీసుకున్న ఫొటోలను ఇన్‌స్టాలో పోస్టు చేస్తుంది.

మగవాడు అంటేనే పగవాడు అంటోన్న రీతూ..

విమానాల హైజాక్‌.. ఈ సినిమాలను అస్సలు మిస్‌ కావద్దు

నెట్టింట కొత్త పోస్టర్ల సందడి..

Eenadu.net Home