‘అఖండ’ కాంబో... ఆయన చాలా నేర్పించారు

2021లో వచ్చిన ‘అఖండ’లో బాలయ్య సరసన స్టెప్పులేసిన ప్రగ్యా జైశ్వాల్‌ ఇప్పుడు..‘అఖండ 2: తాండవం’తో అలరించేందుకు సిద్ధమవుతోంది.

‘టిటూ ఎంబీఏ’ (2014)లో బాలీవుడ్‌లో నటించిన ప్రగ్య... మళ్లీ పదేళ్ల తర్వాత ‘ఖేల్‌ ఖేల్‌ మే’తో అలరించింది. 

‘చదువంటే ఇష్టం. ఎప్పుడూ పుస్తకాలు పట్టుకొని చదువుతూ ఉండేదాన్ని. చిన్నప్పుడు చిత్ర పరిశ్రమ గురించి ఏమీ తెలియదు’ - ప్రగ్య  

‘తెరపై కనిపిస్తానని కలలోనూ అనుకోలేదు. కాలేజ్‌లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్‌తో సినిమాలకు వెళ్లేదాన్ని. అలా కెరీర్‌గా ఎంచుకోవాలని ఆసక్తి కలిగింది’ - ప్రగ్య

బాలకృష్ణ దగ్గర నుంచి కెరీర్‌కు ఉపయోగపడే ఎన్నో అంశాలు నేర్చుకున్నాను. ప్రతి సీన్‌ను మొదటి షాట్‌లాగానే భావిస్తారాయన అని చెప్పింది.

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ ఫొటోషూట్లతో ఆకట్టుకుంటుంది. ఇన్‌స్టా ఖాతాకి 26లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

స్విమ్మింగ్‌, డ్యాన్సింగ్‌ ప్రగ్య హాబీలు. ఖాళీ సమయాల్లో స్నేహితులతో రీల్స్‌ చేసి ఇన్‌స్టాలో షేర్‌ చేస్తుంది.

‘ఇది మొదలు మాత్రమే.. నాకు హద్దులు లేవు. ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిపోవాలని ఉంది’ అని కెరీర్‌ గురించి చెబుతుంటుంది.

కేతిక.. అది దా మ్యాటరు!

నెట్టింట కొత్త కోడలి సందడి..!

నలుపు.. అందాల మెరుపులు

Eenadu.net Home